Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

థమన్ నిజంగా మారినట్లేనా?

థమన్ నిజంగా మారినట్లేనా?

'సామజవరగమన', 'రాములో..రాములా' ఈ పాటలు విన్న తరువాత మ్యూజిక్ డైరక్టర్ థమన్ మీద పాజిటివ్ థింకింగ్ సినిమా అభిమానుల్లో అమాంతం పెరిగిపోయింది. అంతకు ముందు వచ్చిన అరవింద సమేత కూడా ఇందుకు తగిన సాయం చేసింది. వాస్తవానికి తొలిప్రేమ,

అరవింద సమేత ముందు థమన్ మీద అంత పాజిటివ్ ఒపీనియర్ సినిమా అభిమానుల్లోలేదు. సేమ్ టు సేమ్ థమన్ అని ట్రోలింగ్ వుండేది. థమన్ రెమ్యూనిరేషన్ కూడా యాభై లక్షలకు వచ్చేసింది అప్పట్లో.

అలాంటి టైమ్ లో త్రివిక్రమ్ తో సినిమా రావడం అదృష్టంగా మారింది. తొలిప్రేమ సినిమా మంచి పాటలు అని పేరు తెచ్చుకుంది. ఇలాంటి టైమ్ లో మళ్లీ త్రివిక్రమ్ తో అల వైకుంఠపురములో సినిమా పాటలు బయటకు వచ్చి, థమన్ పేరు మారు మోగేలా చేసాయి.

అదే టైమ్ లో దేవీశ్రీ ప్రసాద్ మూడున్నర కోట్ల రెమ్యూనిరేషన్, టైమ్ కు ఇవ్వకపోవడం వంటివి థమన్ కు కలిసి వచ్చాయి. 

అంతవరకు బాగానే వుంది. కానీ థమన్ మారినట్లేనా? అన్నీ మంచి ట్యూన్ లు వస్తున్నట్లేనా? అంటే మాత్రం కొంచెం అనుమానంగా వుంది. ఈ మధ్య అలవైకుంఠపురములో తప్ప మరో మంచి పాట థమన్ నుంచి ఏది వచ్చింది? డిస్కోరాజాలో ఇళయరాజా రెట్రో స్టయిల్ లో వచ్చిన పాట పక్కన పెడితే మరోటి లేదు.

ప్రతిరోజూ పండగే టైటిల్ సాంగ్ కాస్త ఓల్ట్ స్టయిల్ లో వుంది. వెంకీమామ రెండు పాటలు వచ్చాయి కానీ సూపరెహె అన్నట్లు లేవు. 

అల వైకుంఠపురములో రేంజ్ పాటలు ఒక్కటీ థమన్ నుంచి ఆ తరువాత రాలేదు. పాటలు రావడం మాత్రం నాలుగైదు వచ్చాయి . అవి కూడా కాస్త కాంబినేషన్ వున్న సినిమాలే. అంటే దీన్ని బట్టి అల వైకుంఠపురం క్రెడిట్ థమన్ కా? త్రివిక్రమ్ గా అన్న అనుమానం కలుగుతోంది.

వెంకీమాట, ప్రతి రోజూ పండగే, డిస్కోరాజా ఫుల్ ఆల్బమ్ లు వస్తే థమన్ పస తెలిసిపోతుంది. ఎందుకంటే అరవింద సమేత తరువాత, అల వైకుంఠపురములో మధ్యలో సరైన హిట్ పడలేదు. ఇప్పుడు అల వైకుంఠపురములో తరువాత సరైన లైనప్ దొరికితేనే థమన్ పక్కాగా మారి మంచి హిట్ లు ఇస్తున్నట్లు అనుకోవాలి.

అయితే థమన్ అదృష్టం ఏమిటంటే, ఆ రేంజ్ లో అంత పెద్ద మ్యూజిక్ డైరక్టర్ ఎవ్వరూలేరు. మళయాళం, తమిళం ఇలా ఎవర్ని ట్రయ్ చేసినా సరైన సాంగ్స్ రావడం లేదు. వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ ను టాప్ మ్యూజిక్ డైరక్టర్ల కొరత పట్టి పీడిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?