Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

థియేటర్లలోకి ఓటిటి సినిమాలు

థియేటర్లలోకి ఓటిటి సినిమాలు

అటు ఇటు కావడం అంటే ఇదేనేమో? గతంలో థియేటర్లోకి విడుదలయిన తరువాత నెలరోజులకు ఒటిటి ప్లాట్ ఫారమ్ ల్లోకి సినిమా వచ్చేది. పెద్ద సినిమాలు అయితే 45 రోజులకు వచ్చేసేవి. కానీ ఇప్పడు నడుస్తున్నది కరోనా కాలం కదా. వ్యవహారం అటు ఇటు అయింది. థియేటర్ల ఓపెనింగ్ అన్నది దూరంగా వుండడంతో ఓటిటి లకు వెళ్లిపోతున్నాయి సినిమాలు. 

అయితే ఓటిటి కి, శాటిలైట్ కు ఇచ్చేసినా థియేటర్లో విడుదల చేసే ఆప్షన్ వుంటుందట. అది ఎన్ని రోజల తరువాత, ఎన్ని రోజులు వేసుకోవచ్చు అన్నది ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ బట్టి వుంటుంది. ప్రస్తుతానికి అయితే ఒటిటి కి వెళ్తున్న సినిమాలు అన్నీ వంద రోజుల తరువాత థియేటర్లో విడుదల చేసుకునే ఆప్షన్ వుందట.

అంటే ఆన్ లైన్ లో విడుదలయిన మూడునెలల పది రోజుల తరువాత థియేటర్లో వేసుకోవచ్చు. అయితే ఇటీవల విడుదల అయిన వి సినిమాకు మాత్రం ఒక్క వారం వేసుకోవడానికి మాత్రమే అనుమతి వుందని తెలుస్తోంది. నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా సినిమాలు ఎన్ని వారాలు అయినా థియేటర్ లో వేసుకోవచ్చు. 

అయితే ఆన్ లైన్ లో విడుదుల చేసి, శాటిలైట్ లో వేసేసిన తరువాత థియేటర్లో చూసే వారి సంఖ్య చాలా తక్కువ వుండొచ్చు. సినిమాకు మరీ బీభత్సమైన పాజిటివ్ టాక్ వస్తే, బి, సి సెంటర్లలో కాస్త కలెక్షన్లు వుంటాయేమో?

రైతుల్ని భ్రమల్లోనే ఉంచుతున్న బాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?