Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

థియేటర్లు మళ్లీ బంద్?

థియేటర్లు మళ్లీ బంద్?

థియేటర్లు మళ్లీ బంద్ దిశగా పయనిస్తున్నాయా? ప్రభుత్వం బంద్ ప్రకటించకపోయినా, థియేటర్లు స్వచ్ఛధంగా బంద్ పాటించేలా వున్నాయి. వకీల్ సాబ్ తప్పిస్తే మరో సినిమా ఏదీ థియేటర్ లో లేదు.ఏదో ఒక సినిమా వేసినా కరెంట్ ఖర్చులు కూడా వచ్చేలా లేవు. 

వచ్చే వారం విడుదలయ్యే లవ్ స్టోరీ వాయిదా పండింది. దాంతో ఈ నెల 23 వరకు వకీల్ సాబ్ తప్ప మరో సినిమా లేదు. మొదటి మూడు రోజులు చాలా థియేటర్లలో వకీల్ సాబ్ వుంటుంది కానీ, మండే నుంచి చాలా థియేటర్లు తగ్గిస్తారు.వాటిల్లో వేయడానికి సినిమాలు లేవు

ఇదిలా వుంటే 23న రావాల్సిన టక్ జగదీష్ కూడా వాయిదా పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. 23 నాటికి వకీల్ సాబ్ ఉధృతి తగ్గి మరిన్ని థియేటర్లు ఖాళీ అవుతాయి. వాటికీ సినిమాలు లేవు.ఆ పై వారం రావాల్సిన పాగల్ సినిమా కూడా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

సీటీమార్ సినిమా నెలాఖర్లో వుంది కానీ, కరోనా వ్యవహారం ఇలా వుంటే కొనడం కన్నా డిస్ట్రిబ్యూషన్ కే చాయిస్ ఇస్తామని బయ్యర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇలా అయితే ఆ సినిమా కూడా వాయిదా పడే అవకాశం వుంది.

అంటే దాదాపు 20 రోజుల పాటు కేవలం వకీల్ సాబ్ తోనే అన్ని థియేటర్లు నెట్టుకురావాలి. ఇది సాధ్యం అయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో కొందరు యజమానులు స్వచ్ఛందంగా థియేటర్లను మూసి వేసే ఆలోచనలో వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

మినిమమ్ కరెంటు బిల్లులు, కొంత శాతం జీతాలు చెల్లించడం బెటర్ నా? ఏదో సినిమా వేసి నిర్వహణ మేరకు ఖర్చులు రప్పించుకోవడం బెటర్ నా అన్న మల్లగుల్లాలు పడుతున్నారని బోగట్టా. మొత్తం మీద కరోనా రెండో దశ కూడా టాలీవుడ్ కు భారంగానే మారుతున్నట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?