Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టాలీవుడ్ ను చుట్టేస్తున్న కరోనా

టాలీవుడ్ ను చుట్టేస్తున్న కరోనా

కరోనా కల్లోలం విస్తరిస్తోంది. అయితే అదృష్టవశాత్తూ ఈసారి వ్యాపిస్తున్న కరోనా వైరస్ అంత ప్రమాదకారిగా కనిపించడం లేదు. రెండు నుంచి మూడు రోజులు పలు లక్షణాలతో బాధపెట్టి వదులుతోంది. వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు, చేయించుకోని వారు అనే పాయింట్ లేకుండా టాలీవుడ్ లో కరోనా చాలా మందికి సోకుతొంది. 

ఓ పెద్ద బ్యానర్ లో చాలా మంది స్టాఫ్ కు కరోనా సోకింది. దాంతో యూనిట్, ఆఫీసు మొత్తానికి టెస్ట్ లు చేయించి, వ్యాక్సీన్ లు వేయించారు.

ఓ క్లాస్ డైరక్టర్ చిన్న సినిమా యూనిట్ లో పలువురికి కరోనా సోకడంతో, షూటింగ్ నిలిపివేసారు

ఈ నెలలో విడుదల కావాల్సిన ఓ సినిమా నిర్మాత రెండు డోస్ లు వ్యాక్సీన్ వేయించుకున్నారు. అయినా మళ్లీ కరోనా సోకింది. 

అరవింద్, త్రివిక్రమ్, లాంటి వారికి కూడా కరోనా సోకిందని, నెగటివ్ వచ్చేసిందని ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ ఫంక్షన్ తరువాత విపరీతమైన వళ్లు నొప్పులతో బాధపడ్డారు. ఎందుకయినా మంచిది అని ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆయన స్టాఫ్ లో కొందరికి కరోనా సోకిందని వార్తలు వచ్చాయి.

నిర్మాత బండ్ల గణేష్ కు గతంలో కరోనా లాస్ట్ ఇయర్ లో వచ్చి తగ్గింది. కానీ గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా మళ్లీ సోకిందా? కాదా? అన్నది తెలియదు. 

ఇలా ఇండస్ట్రీ మొత్తం ఏ యూనిట్ లో అయినా ఇదే డిస్కషన్ పాయింట్ గా వుంది. కొన్ని యూనిట్లు పరిస్థితి గమనించి, ఇప్పట్లో విడుదలలు వుండేలా లేవు అని సినిమా షూటింగ్ లు నిలిపివేసాయి కూడా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?