Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ట్రాక్‌ రికార్డ్‌కి హీరోలు పడే రోజులు కావు

ట్రాక్‌ రికార్డ్‌కి హీరోలు పడే రోజులు కావు

ఎంత పెద్ద దర్శకుడైనా, ఎంత మంచి ట్రాక్‌ రికార్డ్‌ వున్నా అది అతని గత సినిమా వరకే అనేది మన హీరోలకి తెలిసి వచ్చింది. మురుగదాస్‌, త్రివిక్రమ్‌లాంటి దర్శకులు ఇచ్చిన డిజాస్టర్లతో అవి చేసిన హీరోలకే కాకుండా మిగిలిన వారికీ రియలైజేషన్‌ వచ్చేసింది. ఫలానా దర్శకుడు అనగానే కథ అడగకుండా, అతనిపై నమ్మకంతో సినిమా మొదలు పెట్టేయడానికి హీరోలు సుముఖంగా లేరు.

ఎన్ని హిట్లు తీసిన దర్శకుడిని అయినా, గత సినిమా బ్లాక్‌బస్టర్‌ చేసిన దర్శకుడికి అయినా మలి సినిమా ఓకే చేసుకోవడం అంత ఈజీ కాదు. త్రివిక్రమ్‌తో పని చేయాలని ఫిక్స్‌ అయిన అల్లు అర్జున్‌ అతని నుంచి తనకి కావాల్సిన కథ వచ్చే వరకు వేచి చూడాలనే ఫిక్స్‌ అయ్యాడు తప్ప లేట్‌ అవుతోందని సగం వండిన కథతో సినిమా మొదలు పెట్టడం లేదు.

అలాగే రంగస్థలం లాంటి నాన్‌-బాహుబలి ఇండస్ట్రీ ఇచ్చిన సుకుమార్‌కి కూడా మలి సినిమాని ఓకే చేసుకోవడం సులభతరం కాలేదు. మహేష్‌ చేస్తానని మాట అయితే ఇచ్చాడు కానీ అతడిని మెప్పించే కథ మాత్రం ఇంకా రెడీ కాలేదు. రంగస్థలం ఇచ్చిన ఊపులో వున్నాడని సుకుమార్‌ని మహేష్‌ నమ్మట్లేదు. తన కోసం రాసిన కథలో విషయం వుందా, అదీ ఓ రంగస్థలం కాగలదా అని మాత్రమే చూస్తున్నాడు. 

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?