Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ట్రబుల్ ఇస్తున్న కమెడియన్?

ట్రబుల్ ఇస్తున్న కమెడియన్?

ఆ కమెడియన్ కు మంచి టైమింగ్ వుంది. ఎక్కడ? యాక్టింగ్ లో. డైలాగ్ డెలవరీలో. కానీ అస్సలు టైమింగ్ లేదు. ఎక్కడా? షూటింగ్ కు రావడంలో. ఇదీ ఇప్పుడు టాలీవుడ్ లో లేటెస్ట్ గుసగుస. ఓ మాంచి క్రేజీ పేరు జోడించుకుని వినిపించే పేరు వుంది. మంచి కమెడియన్ అన్న అభిమానులు వున్నారు.

కానీ పాపం, ఇతగాడు నిర్మాతలను మాత్రం నానా బాధా పెట్టేస్తున్నాడట. టైమ్ కు షూటింగ్ కు రాకపోవడం, వచ్చినా కాస్త 'ఆన్'లో రావడం తప్పడం లేదట. ఈరోజు కూడా ఓ షూటింగ్ కు రావాల్సివుంది. కానీ రాత్రి ఎనిమిదిన్నర అయినా రాలేదట. 

ఫోన్ చేస్తే స్విచాఫ్. మేనేజర్ ను అడిగితే, మన్నించండి తానేమీ చేయలేను అని సమాధానం అంట. ఇది ఓ సినిమా సంగతికాదు. చాలా సినిమాలకు ఇతగాడి ప్రవర్తన ఇలాగే వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే తెలుగులో సరైన కమెడియన్ లు రావడంలేదు. పేరుకు బోలెడు మంది కమెడియన్ లు వున్నా, బ్రహ్మీ మాదిరిగా నిలదొక్కుకునేవారు చాలాతక్కువ మంది కనిపిస్తున్నారు. 

ఇలాంటి టైమ్ లో కాస్త బాగున్నవారు కూడా ఇలా అలవాట్ల బారినపడి, నిర్మాతలను దూరం చేసుకుంటే కెరీర్ ఏమవుతుంది? గతంలో ఓ మంచి కమెడియన్ ఇలాగే మందు కారణంగా అవకాశాలు పోగొట్టుకుని, దాదాపు ఇండస్ట్రీకి దూరం అయిపోయారు. ఇప్పుడు ఈ కమెడియన్ ఇన్ డిసిప్లిన్ సంగతులు వింటుంటే, మళ్లీ అదేబాటలో పయనిస్తున్నట్లు అనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?