Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టక్ జగదీష్ వెనక్కు?

టక్ జగదీష్ వెనక్కు?

నాని-రీతూవర్మ-ఐశ్వర్య రాజేష్ ల కాంబినేషన్లో తయారవుతున్న సినిమా టక్ జగదీష్. ఈ సినిమాకు దర్శకుడు శివనిర్వాణ. నిర్మాత సాహు గారపాటి. ఏప్రిల్ 16న విడుదలకు పోస్టర్ వేసేసారు కూడా . అయితే ఇప్పుడు ఓ వారం వెనక్కు జరిగే అవకాశం వుందని తెలుస్తోంది.

అదే డేట్ కు శేఖర్ కమ్ముల-నాగ్ చైతన్య- సాయిపల్లవి ల  లవ్ స్టోరీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే కనుక ఫిక్స్ అయితే, టక్ జగదీష్ ను ఓ వారం వెనక్కు జరిపే అవకాశం వుంది.

ఎందుకంటే లవ్ స్టోరీ నిర్మాత సునీల్ నారంగ్ చేతిలోనే నైజాం థియేటర్లు అన్నీ దాదాపుగా వున్నాయి. అందువల్ల టక్ జగదీష్ కన్నా లవ్ స్టోరీకి ప్రయారిటీ నాచురల్ గా వుంటుంది. అందుకే టక్ జగదీష్ ను ఓ వారం వెనక్కు జరిపే దిశగా డిస్కషన్లు జరుగుతున్నట్లు బోగట్టా.

టక్ జగదీష్ ఆంధ్ర-తెలంగాణ థియేటర్ హక్కులు గుత్తగా 22 కోట్లకు డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ కొనుగోలు చేసారు. సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ చేసుకుంది. 

నువ్వు ఒడిపోతే పార్టీ మూసివేస్తావా !

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?