Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

యువి నుంచి 10 చిన్న సినిమాలు

యువి నుంచి 10 చిన్న సినిమాలు

యువి క్రియేషన్స్ అంటే మిర్చి దగ్గర నుంచి సాహో వరకు అనేకానేక భారీ సినిమాలు కళ్లముందుకు వస్తాయి.  అయితే మారుతున్న పరిస్థితులు, ఈక్వేషన్లు అన్నీ చూసుకుని ట్రాక్ మారుస్తోంది యువి సంస్థ. వరుసగా చిన్న సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. రాథేశ్వామ్ సినిమా సగంలో వుంది. యాభై శాతం వర్క్ అయింది. ఇంకో యాభై శాతం వర్క్ మిగిలి వుంది. అది నవంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. పైగా ఈ సినిమాకు ఇంకా మరోసారి ఇటలీ షెడ్యూలు వుండనే వుంది.

ఈ లోగా వరుసగా చిన్న సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ తో ఓ సినిమాను ఇప్పటికే దాదాపు పూర్తి చేసారు. మేర్లపాక గాంధీ పర్యవేక్షణ, ఆయన శిష్యుడు దర్శకత్వం. అదే హీరోతో మరో సినిమా అనిల్ అనే కొత్త దర్శకుడితో స్టార్ట్ చేయబోతున్నారు. 

ఇవి కాక దాదాపు అరడజనుకు పైగా చిన్న కథలు రెడీ అవుతున్నాయని బోగట్టా. ఇవన్నీ కూడా చిన్న సినిమాలే. అయితే ఓటిటి లేదా థియేటర్ అనే ప్లాన్ ఏ, బి లు పెట్టుకుని వీటన్నింటినీ రెడీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే మారుతి డైరక్షన్ లో గీతా 2 తో కలసి ఓ సినిమా చేయాలి. దానికి ఇంకా హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వుంది. 

ప్రభాస్ మరో మూడేళ్ల వరకు ఖాళీ లేకపోవడం, మరే పెద్ద హీరో డేట్లు కూడా ఇప్పట్లో దొరికే పరిస్థితి కనిపించకపోవడంతో యువి సంస్థ చిన్న సినిమాల రూట్ పట్టినట్లు కనిపిస్తోంది. 

జగన్ గారి గురించి భయంగా ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?