Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వడ్డీ లేని అప్పులతో పవన్ గేమ్స్?

వడ్డీ లేని అప్పులతో పవన్ గేమ్స్?

కొన్నాళ్ల పాటు పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేసి, రెండు చోట్ల పోటీ చేసి, ఓటమి చవి చూసి, మరో మూడేళ్ల పాటు చేయాల్సిన పనేమీ లేదని తెలిసి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 

ఇవ్వడం ఇవ్వడం మామూలుగా కాదు, మూడు సినిమాలు ఓకె చేసారు. అక్కడితో ఆగలేదు..ఆపై రామ్ తాళ్లూరితో మరో సినిమా అంటూ వార్తలు వచ్చాయి. ఇంకా ఆగలేదు బండ్ల గణేష్ తో కూడా సినిమా అన్న ట్వీట్లు వచ్చాయి.

ఇవన్నీ ఇలా వుండగానే ఇప్పుడు అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని వార్తలు వచ్చేసాయి. జనవరి నుంచి 35 రోజులు డేట్ లు ఇవ్వడానికి పవన్ ఓకె అన్నారన్నది విషయం. 

నిజానికి వకీల్ సాబ్ తరువాత క్రిష్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి వుంది. క్రిష్ వేరే సినిమా మీద వున్నారు. ఆయన రావడం లేటు అవుతుంది. ఆ లోగా అయ్యప్పన్ రీమేక్ చేసేయాల్నది పవన్ ప్లాన్.

అంటే ఆ తరువాత క్రిష్ సినిమా. అది పూర్తయ్యే సరికి దసరా వచ్చేస్తుంది. అప్పుడు కానీ మైత్రీ-హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేయలేరు. అది పూర్తయ్యేసరికి 2022 సమ్మర్ వస్తుంది. 

ఇక అప్పుడు కానీ సురేందర్ రెడ్డి సినిమా చాన్స్ రాదు. మరి ఇక బండ్ల గణేష్ సంగతేమిటి?  ఈ లోగా అనేకానేక రాజకీయ పరిణామాలు, ఇంకేవైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.  వుంటాయేమో తెలియదు. అప్పటి వరకు నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ లు అలా పడి వుండాల్సిందే. వడ్డీ లేని అప్పుల మాదిరిగా. 

నిజానికి పవన్ చేయాల్సింది ఇది కాదు. వకీల్ సాబ్ తరువాత క్రిష్ సినిమా చేయడానికి అవకాశం లేకపోతే హరీష్ శంకర్ సినిమా కు అవకాశం ఇవ్వాలి. ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏమిటి? అంటే పవన్ కు ముఫై రోజులు గ్యాప్ దొరికితే హ్యాపీగా మరో యాభై కోట్లు చేసేసుకోవచ్చు అన్న ఐడియా వచ్చిందనుకోవాలా?  తీసుకున్న అడ్వాన్స్ లకు ముందు న్యాయం చేయకుండా ఇదేమిటి?

అప్పటి వరకు నిర్మాతలు ఎప్పటికి పవన్ తో సినిమా వుంటుందో, పూర్తవుతుందో అంటూ వెయిటింగ్ లో వుండాల్సిందే. అన్నీ బాగానే వున్నాయి కానీ 2021 సంక్రాంతికి వకీల్ సాబ్, సమ్మర్ కు అయ్యప్పన్ రీమేక్, కుదిరితే దసరాకు హరీష్ శంకర్ సినిమా ఇలా ఒకే ఏడాది మూడు సినిమాలు వదల్తారా? ఏమో? పవన్ గేమ్స్ రాజకీయాల్లో అయినా, సినిమాల్లో అయినా ఎవరికి అర్థం కావు 

జ‌గ‌న్‌ను హీరోగా నిలిపిన‌ అపెక్స్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?