
కరోనా కల్లోలం చల్లారిపోగానే విడుదల కావాల్సిన సినిమాల్లో వకీల్ సాబ్ సినిమా కచ్చితంగా ఓ క్రేజీ ప్రాజెక్టు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ కాబట్టి. అయితే ఈ సినిమా సినిమా 2020లో విడుదల అవుతుందా? అన్నది అనుమానం.
ఎందుకంటే వకీల్ సాబ్ కు ఇంకా మరో ముఫై నుంచి నలభై రోజుల వర్క్ వుంది. అందులో పవన్ వర్క్ నే 20 రోజులు. జూన్ నుంచి షూటింగ్ లు స్టార్ట్ అయినా ఆగస్టుకు కానీ సినిమా పూర్తిగా రెడీ కాదు. వెంటనే వేద్దాం అంటే థియేటర్ల ట్రెండ్ ఎలా వుంటుందో తెలియదు.
దసరాకు రెడీ చేద్దాం అంటే ఈ సారి దసరా సీజన్ వుండకపోవచ్చు. స్కూళ్లు అన్నీ ఆగస్టు నుంచి ఓపెన్ అవుతాయి కనుక, ఇక దసరా, తదితర సెలవులు బాగా తగ్గిపోతాయని తెలుస్తోంది. అలా అయితే దసరా సీజన్ కిట్టుబాటు కాదు. అందువల్ల ఇక మిగిలింది 2021 సంక్రాంతినే.
ఆర్ఆర్ఆర్ రాదు అనుకుంటే మెగా అన్నదమ్ములు ఇద్దరి సినిమాలు కాస్త గ్యాప్ తో 2021 సంక్రాంతికి వచ్చే అవకాశం వుంది. లేదూ దిల్ రాజు ధైర్యం చేస్తే మాత్రం ఈ ఏడాది చూసే అవకాశం వుంది. కానీ ఆ అవకాశాలు తక్కువే అని టాక్ వినిపిస్తోంది.
టీడీపీవాళ్ళు తాగే బ్రాండ్స్ మాదగ్గర లేవు