Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'వాళ్ల'పై భ్రమలు తొలగిపోతున్నాయ్

'వాళ్ల'పై భ్రమలు తొలగిపోతున్నాయ్

పొరుగింటి పుల్లకూర ఎప్పుడూ రుచే. మన హీరోలకు పక్క భాషల డైరక్టర్లు అంటే చాలు భలే ఇష్టం. పూరి తన సినిమాలో ఇదే విషయాన్ని వేణుమాధవ్ కామెడీ ట్రాక్ తో సెటైరికల్ గా చెప్పాడు కూడా. 

తమిళంలో లేదా ఇంకే భాషలో అయినా గట్టిగా ఓ హిట్ కొడితే చాలు. మన హీరోలు వాళ్లవైపు చూస్తారు. ఏదైనా పాయింట్ వుంటే చెప్పమంటారు. కానీ అంతలోనే అదే డైరక్టర్ సత్తా తెలిసివస్తుంది. పక్కన పెడతారు.

లింగుస్వామి అనే డైరక్టర్ వుండేవారు. ఆయనతో తెలుగు సినిమామ‌అని తెగవార్తలు వుండేవి. బన్నీ అయితే ఏకంగా చెన్నయ్ వెళ్లి ఓపెనింగ్ కూడా చేసి వచ్చారు. ఇప్పుడు ఆ దర్శకుడూ లైన్ లో లేరు. సినిమానూ లేదు.

అట్లీ అనే డైరక్టర్ పేరు ఆ మధ్య తెగ వినిపించింది. ఎన్టీఆర్ తో సినిమా అనే గ్యాసిప్ లు వచ్చేసాయి. తమిళ హీరో విజయ్ తో వరుసగా సినిమా చేసాడు. విజిల్ సినిమా తరువాత ఇక అట్లీ పేరు వినిపించడం ఆగిపోయింది.

కనగరాజ్ పేరు కూడా కొన్నాళ్లుగా వినిపిస్తూ వచ్చింది. రామ్ చరణ్ తో ఎక్కువగా ముడిపెడుతూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు సదరు దర్శకుడి సత్తా ఏమిటో తెలిసిపోయింది. అందువల్ల ఇక ఇప్పట్లో సినిమా వుంటుందని అనుకోనక్కరలేదు. 

ప్రస్తుతానికి ఇక ప్రశాంత్ నీల్ ఒకరు వున్నారు. కేజిఎఫ్ 2 రిజల్ట్ బట్టి ఆయన వ్యవహారం కూడా తెలిసిపోతుంది.

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?