Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వరాలు ఇప్పుడు.. పేమెంట్లు తరువాత

వరాలు ఇప్పుడు.. పేమెంట్లు తరువాత

గ్రేట్ ఆంధ్ర రెండు మూడు రోజుల కిందటే వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు ఇండీరియమ్ రిలీప్ ఇవ్వబోతున్నారని. (త్వరలో విడుదల.. ఉద్యోగులకు తాయిలాలు) ఇప్పుడు చంద్రబాబు నిన్నటికి నిన్న అది ప్రకటించేసారు. కానీ చంద్రబాబు ప్రకటిస్తున్న వరాలు అన్నీ తన అనుకూల దినపత్రికల్లో పెద్ద అక్షరాలతో రాసుకోవడానికే పనికి వచ్చేలా వున్నాయి. ఉద్యోగులకు ఐర్ ఇవ్వడంలో వచ్చిన వార్తల్లో చాలా సందేహాలు వుండిపోయాయి.

ముఖ్యంగా జూలై నుంచి ఇస్తారట. అప్పటి వరకు అరియర్స్ ఇస్తారు. అరియర్స్ మరి నగదుగా ఇస్తారా? పిఎఫ్ లో వేస్తారా? అన్నది చెప్పలేదు. అలాగే ఫించనర్లకు కూడానా పెంపు? కాదా? అన్నది క్లారిటీలేదు. అయినా ఇప్పుడు పెంచుతున్నాం అని చెప్పి ఎప్పుడో జూలైలో ఇవ్వడం ఏమిటి?

ఇదే కాదు, ఆ మధ్య పింఛనర్ల డిఆర్ సవరింపు కూడా మే నుంచి అంటూ వెల్లడించారు. అంటే బాబు వరాలు అన్నీ ఎన్నికల ముందు ప్రకటిస్తూ, భారం మాత్రం ఎన్నికల తరువాత నెడుతున్నారన్నమాట. తను అధికారంలోకి వస్తే ఏదో ఒకటి చేసి ఇస్తారు. లేదూ అంటే ఆ భారం వచ్చిన ప్రభుత్వం చూసుకుంటుంది. అదే విధంగా తనను గెలిపిస్తేనే తను ఇచ్చినమాట జరుగుతుందని కండిషన్ పెట్టినట్లు అవుతుంది.

అంటే మాటలుగా ఇచ్చేసే వరాల బాబు ఇప్పుడు ప్రకటిస్తున్నారు. కానీ ఆయన ప్రభుత్వం ఇప్పుడు ఆర్థికభారం మోయలేదు కాబట్టి, అన్నీ మే, జూన్, జూలై అంటున్నారు. ఆయన అనుకూల మీడియా కూడా ఇదేంటీ అని అడడకుండా, ఆ ప్రస్తావనే తేకుండా, అబ్బో బాబు సూపర్.. సూపర్ అంటూ భజనలో మునిగి తేలుతున్నాయి.

'గెలవడం అసాధ్యం' అనే లెవల్‌ నుంచి వైఎస్‌ఆర్‌ ఎలా గెలిచారు

డబ్బుంటేనే గెలిచేస్తారా? ఈ ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?