cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

వారెవ్వా.. అశోక్ బాబు

వారెవ్వా.. అశోక్ బాబు

ఆంధ్ర ఉద్యోగులు అంతా అశోక్ బాబుకు రుణపడి వుండాలి. ఎందుకంటే వారందరినీ ఆయన తన అద్భుతమైన ప్రణాళిక ప్రకారం తెలుగుదేశం దిశగా నడిపించారు. ఇంకా అదే విధంగా వారిని మబ్బులో వుంచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా బాబుగారి నుంచి రాజకీయాల్లోకి రారండీ అంటూ పిలుపును అశోక్ బాబు అందుకున్నారు.

కానీ ఉద్యోగులు మాత్రం డిఎ బకాయిలు, పాత వేజ్ రివిజన్ బకాయిలు అందక, కొత్త పే రివిజన్ పై కమిటీ వేస్తాం అనే మాట మాత్రం అలా నిర్లిప్తంగా వుండిపోయారు. కానీ పక్క తెలంగాణ రాష్ట్రంలో డిఎ బకాయిలు లేవు. వేజ్ రివిజన్ బకాయిలు లేవు. కొత్త పీఆర్సీ వేసేసారు. ఏడాదిలోపు నివేదిక ఇవ్వకుంటే, తానే అడ్ హాక్ గా జీతాలు పెంచేస్తానని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు.

అన్నింటికి మించి, ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ సిబ్బందికి ఇంటీరియమ్ రిలీప్ కూడా ప్రకటించేసారు. 16శాతం ఇంటీరియమ్ రిలీఫ్ అంటే తక్కువేమీ కాదు. ఎప్పుడయితే ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చారో, ఇక రేపో, ఎల్లుండో ప్రభుత్వ సిబ్బంది అడుగుతారు. కెసిఆర్ ఇస్తారు.

కానీ పాపం, మన బాబుగారి భజన మీడియా మాత్రం తెలంగాణలోని ఇలాంటి ప్రమాదకరమైన వార్తలను ఆంధ్ర ఎడిషన్లలోకి తీసుకురాదు. తీసుకువచ్చి, ఆంధ్ర ఉద్యోగుల మనసులు బాధపెట్టదు. అంతా అశోక్ బాబు చూసుకుంటాడు. ఉద్యోగులను అలా బుజ్జగిస్తూ, బాబుగారి బాటలో నడిపిస్తుంటారు.

కానీ ఉద్యోగులు అంత అమాయకులు కారు. ఒకసారి అశోక్ బాబు మాట విన్నందుకు ఏం జరుగుతోందో? ఆయనకు మాత్రం ఏం ఒరుగుతోందో? అన్నీ సైలంట్ గా గమనిస్తున్నారు. టైమ్ వచ్చాకా ఎంప్లాయీస్ పవర్ ఏమిటో చూపిస్తారు. అది వారికి అలవాటే.