విజయబాపినీడు-చిరంజీవి.. కన్నీళ్లు

దర్శకుడు, నిర్మాత, విజన్ వున్న వ్యక్తి విజయ బాపినీడు. ఆయన తన వృద్ధాప్యంలో మరణించారు. మెగాస్టార్ చిరంజీవి వెళ్లి కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకు బాపినీడుతో వున్న అనుబంధం అలాంటిది. చిరంజీవి జీవితంలో మరువలేని…

దర్శకుడు, నిర్మాత, విజన్ వున్న వ్యక్తి విజయ బాపినీడు. ఆయన తన వృద్ధాప్యంలో మరణించారు. మెగాస్టార్ చిరంజీవి వెళ్లి కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకు బాపినీడుతో వున్న అనుబంధం అలాంటిది. చిరంజీవి జీవితంలో మరువలేని సినిమాలు, మ్యాగజైన్, మెగాస్టార్ బిరుదు అన్నీ విజయ బాపినీడు ఇచ్చినవే. 

అయితే బాపినీడును అవసరం తీరిపోయాక చిరంజీవి వదిలేసారని, నష్టాలకు గురించేసారని ఓ విమర్శ. సినిమా రంగానికి చెందిన ఓ నిర్మాత 'గ్రేట్ ఆంధ్ర'కు ఫోన్ చేసి, మెగా ఫ్యామిలీనే కాదు, ఇండస్ట్రీలో హీరోలు వాడుకుని వదిలేస్తారు. ఈ ఫ్యామిలీలను పట్టుకుని వేలాడినవారు ఎందరో చివరిరోజుల్లో ఆయా హీరోల నిరాదరణకు గురైనవారే. నష్టాలు చూసినవారే. కొత్త నిర్మాతలు వస్తే, పాత నిర్మాతలకు, ముఖ్యంగా తమతోనే చివరివరకు వున్నవారికి హ్యాండ్ ఇవ్వడం అన్నది తెలుగులో హీరోలకు అలవాటే అంటూ చెప్పుకువచ్చారు.

విజయ బాపినీడుకు సినిమా చేస్తానని చిరంజీవి మాట ఇచ్చారట. 2002లోనో, కాస్త అటు ఇటుగానో ఇవివి సత్యనారాయణతో ప్రాజెక్టు ఫిక్స్ చేయించారట. కాస్టింగ్ సెలక్షన్ చేయించారట. అందరికీ అడ్వాన్స్ లు ఇప్పించేసారట. సినిమా ముహూర్తం చేసి, మరి ఎందుకో క్యాన్సిల్ కొట్టించేసారట. దాంతో ఆ రోజుల్లో కోటి రూపాయలు విజయబాపినీడు నష్టపోయారట.

తరువాత ఆ డైరక్టర్ తో, ఈ డైరక్టర్ తో సినిమా అంటూ తిప్పించుకున్నారు తప్ప చిరంజీవి సినిమా చేయలేదట. దాంతో విజయబాపినీడు మనోవ్యథకు గురై, ఆరోగ్యం పాడుచేసుకున్నారని ఆ నిర్మాత చెప్పారు. ఆ నిర్మాత చెప్పింది ఎంతవరకు నిజం అన్నది పక్కన పెడితే, టాలీవుడ్ లో వరుసపెట్టి ఒకే హీరోతో సినిమాలు చేసిన చాలామంది నిర్మాతలు ఫాగ్ ఎండ్ లో పాపం, నష్టాలకు గురై, అదే హీరోల అనాదరణకు గురైనవారే.

బాపినీడు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా స్టిల్స్ కోసం క్లిక్ చేయండి