‘విశ్వాసం’ తెలుగు విడుదల వుంటుందా?

ఈసారి సంక్రాంతి సినిమా పుంజులు ఒకటీ రెండూ కావు. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, వెంకీ-వరుణ్ ల ఎఫ్ 2, రామ్ చరణ్ 'వినయ విధేయరామ', రజనీ కాంత్ పెటా ఇప్పటికే షెడ్యూలు అయ్యాయి. జనవరి…

ఈసారి సంక్రాంతి సినిమా పుంజులు ఒకటీ రెండూ కావు. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, వెంకీ-వరుణ్ ల ఎఫ్ 2, రామ్ చరణ్ 'వినయ విధేయరామ', రజనీ కాంత్ పెటా ఇప్పటికే షెడ్యూలు అయ్యాయి. జనవరి మూడోవారంలో వస్తుందనుకున్న అజిత్ 'విశ్వాసం' కూడా తమిళనాట పండుగకే విడుదలవుతోంది.

అయితే ఈసినిమాను మాత్రం తెలుగులో ఇంకా ఎవరూ తీసుకున్నట్లు లేదు. తెలుగులో విడుదల హడావుడి, ప్రచారం కనిపించడం లేదు. కానీ ఇప్పటికిప్పుడు ఎవరైనా తీసుకుంటే పండుగకు వచ్చే అయిదో సినిమా అవుతుంది. పెటా, విశ్వాసం, వినయ విధేయ మూడూ మాస్ సినిమాలే. ఎఫ్ 2, బయోపిక్ లకు మాత్రమే ఫ్యామిలీ ట్యాగ్ లైన్ పడుతుంది.

ఇప్పటికే థియేటర్లు ఫిక్స్ అయిపోయాయి. దిల్ రాజు, యువి, గీతా చేతుల్లో వున్న థియేటర్లు ఎక్కువగా వినయ విధేయ, ఎఫ్ 2కు వెళ్లిపోయాయి. సురేష్ బాబు, ఏషియన్ సునీల్ బయోపిక్ కు అండగా వున్నారు. పెటాకు థియేటర్లు దొరకడమే కష్టం. ఇంక విశ్వాసం వస్తే కనుక మరీ కష్టం అవుతుంది. అందువల్ల ఓ వారం గ్యాప్ లో వస్తుందేమో తెలుగులోకి.

కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటువైపు

వివాదాలు.. వైఫల్యాలు.. వివాహాలు..!