Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వివాదాల 'ఘని' ?

వివాదాల 'ఘని' ?

వరుణ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు కిరణ్ డైరక్షన్ లో అల్లు బాబి, సిద్దు నిర్మిస్తున్న సినిమా 'ఘని' అయితే ఈ సినిమా ఆది నుంచీ మూడు అడుగులు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతూ వస్తోంది. 

ఇటీవల మరీ వ్యవహారం ముదిరినట్ల ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు నిర్మాతలు అల్లు అరవింద్ తనయుడు బాబి. ఆయన స్నేహితుడు సిద్దు. నిర్మాతలు ఇద్దరూ మిత్రులే అయినా ఈ మధ్య అంతగా పొసగడం లేదని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

పైగా హీరో కథ విషయంలో అంత సంతృప్తిగా లేకపోవడం, తరచు మార్పులు చేర్పులు చేయిస్తుండడంతో, డైరక్టర్ కూడా ఇక తన వల్ల కాదని, ఇలా అయితే చేయలేనని చెప్పేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తరచు మార్పులు చెబితే చేయడం కష్టమని అన్నట్లు బోగట్టా.

ఇదిలా వుంటే హీరో సూచన మేరకు యాభై లక్షలతో భారీ సెట్ వేసారు కానీ దాన్ని షూట్ చేయకుండానే తీసేయాల్సి వచ్చింది. ఈ విషయంలో నిర్మాతల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయని వినికిడి.

ఈ టోటల్ వ్యవహారం మీద డైరక్టర్ కిరణ్ ను ప్రశ్నిస్తే అవేవీ లేవన్నారు. హీరోకు చేయి ఇబ్బంది పెట్టడం వల్ల సెట్ లో షూట్ చేయకుండానే తీసేయాల్సి వచ్చిందన్నారు. ఈ లోగా కోవిడ్ వ్యవహారాలు, భారీగా జూనియర్ ఆర్టిస్ట్ లు కావాల్సి రావడం, ఫారిన్ ఫైట్ మాస్టర్ లు అవైలబుల్ లేకపోవడం వల్ల అంతా ఆగిందన్నారు.

కొద్దిగా టాకీపార్ట్, ఎక్కువగా యాక్షన్ పార్ట్ మినహా అంతా రెడీ అయిందని, టాకీ ఎక్కువ లేనపుడు ఇక హీరోతో సమస్యలు ఏముంటాయని ఆయన అన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?