సైరాలో మరో మెగా హీరో.. సంప్రదింపులు షురూ?

చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది సైరా సినిమా. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు చాలానే ఉన్నాయి. వాటి ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. తమన్న, సుదీప్, విజయ్ సేతుపతి, అమితాబ్…

చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది సైరా సినిమా. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు చాలానే ఉన్నాయి. వాటి ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. తమన్న, సుదీప్, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్.. ఇలా చాలా క్యారెక్టర్స్ కనువిందు చేయబోతున్నాయి. చివరికి మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా సైరా సినిమాలో ఉంది. ఇప్పుడీ సినిమాకు మరో మెగా ఎట్రాక్షన్ యాడ్ అవ్వబోతోంది.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే సైరా సినిమాలో ఓ మెగా హీరో కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సినిమాలో ఓ కీలకమైన పాత్రను ఎవరైనా మెగా హీరోతో చేయిస్తే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. ఈ మేరకు కాంపౌండ్ హీరోలతో చర్చలు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

అసలే చిరంజీవి సినిమా, పైగా రామ్ చరణ్ నిర్మిస్తున్న మూవీ. సో.. కాంపౌండ్ లో ఏ హీరోను అడిగినా కాదనే సమస్యలేదు. క్యారెక్టర్ చిన్నదైనప్పటికీ చిరు లేదా చరణ్ అడిగితే కచ్చితంగా నటిస్తారు. ఎటొచ్చి ఆ ఛాన్స్ ఎవరికి దక్కబోతోందనేదే పజిల్.

ప్రస్తుతానికైతే కాంపౌండ్ లో బన్నీ ఒక్కడే ఖాళీగా కనిపిస్తున్నాడు. ఇప్పటికిప్పుడు కాల్షీట్ల సమస్య లేకుండా ముఖానికి రంగేసుకోమంటే అల్లుఅర్జున్ ఒక్కడే సిద్ధంగా ఉన్నాడు. మిగతా హీరోలంతా తమతమ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చిరు ఆదేశిస్తే రెక్కలు కట్టుకొని వాలిపోతారు.

ఇంతకీ సైరా సినిమాలో ఆ కీలకమైన పాత్ర ఏంటి? అసలు ఆ పాత్ర కోసం మెగా హీరోల్ని సంప్రదించాల్సిన అవసరం ఎందుకొచ్చిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు.

'గెలవడం అసాధ్యం' అనే లెవల్‌ నుంచి వైఎస్‌ఆర్‌ ఎలా గెలిచారు

డబ్బుంటేనే గెలిచేస్తారా? ఈ ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే!