Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ ఈ టైమ్ లో ఫంక్షన్ పెట్టుకుంటాడా?

పవన్ ఈ టైమ్ లో ఫంక్షన్ పెట్టుకుంటాడా?

అజ్ఞాతవాసి తర్వాత పూర్తిగా పరిశ్రమ నుంచి సైడైపోయాడు పవన్. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో పోస్ట్-రిలీజ్ ప్రమోషన్ లాంటివి కూడా పెట్టుకోలేదు. ఏపీ రాజకీయాలు, జనసేన పార్టీ పనులు, ఛలోరే ఛలోరె ఛల్ యాత్రలకే పరిమితమైపోయాడు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్, మరోసారి ఇండస్ట్రీ వైపు చూస్తాడని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు. కానీ అతడు ఓ ఫంక్షన్ కు రావాల్సిన టైం వచ్చింది.

నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను మరో 4రోజుల్లో పెట్టుకున్నారు. ఈ సినిమా నిర్మాతల్లో పవన్ కల్యాణ్ కూడా ఒకడు. త్రివిక్రమ్, సుధాకర్ రెడ్డితో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు పవన్. సో.. సినిమాకు హైప్ తీసుకురావాలంటే పవన్ హాజరవ్వాల్సిందే. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల మధ్య పవన్ మళ్లీ ఇలాంటి ఫంక్షన్లకు వస్తాడా అనేది డౌట్.

ఎందుకంటే.. ఇండస్ట్రీకి దాదాపు దూరమైపోయాడు పవన్. ప్రస్తుతం పవర్ స్టార్ అని పిలిపించుకోవడం కంటే జనసేనాని అనిపించుకోవాలని ఎక్కువగా తహతహలాడుతున్నాడు. టీడీపీ నేతలపై, మరీ మఖ్యంగా లోకేష్ పై తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టాడు. ఇలాంటి టైమ్ లో మళ్లీ టాలీవుడ్ వైపు తొంగిచూసినా, ఏదైనా ఈవెంట్ కు హాజరైనా టీడీపీ వాళ్లకు విమర్శించడానికి అవకాశం ఇచ్చినట్టవుతుంది.

సినిమా ఫంక్షన్లకు హాజరవ్వడంలో తప్పులేదు. పలువురు రాజకీయ నాయకులు కూడా సినీ ఫంక్షన్లకు వస్తుంటారు. కానీ పవన్ సినిమా ఫంక్షన్ కు హాజరైతే మాత్రం అది విమర్శలకు తావిస్తుంది. టాలీవుడ్ కు పూర్తిగా దూరమయ్యానని తనుకుతాను ప్రకటించుకున్న పవన్, ఓ సినీవేడుకకు హాజరైతే విమర్శల జడివాన తప్పదు. మరీ ముఖ్యంగా బోడి గుండుకు, మోకాలికి ముడిపెట్టే టీడీపీ నాయకులైతే లేనిపోనివన్నీ కల్పించి మరీ పవన్ ను బద్నామ్ చేయడానికి వెనకాడరు. ఈ విషయంలో జనసేనాని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే బెటర్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?