వైకాపా నుంచి దాసరి జై రమేష్?

విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్ ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు వీలుగా వైకాపా…

విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్ ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు వీలుగా వైకాపా తీర్థం పుచ్చుకుంటారని బోగట్టా.

విజయవాడ నుంచి ఎంపీగా వైకాపా తరపున పోటీ చేయాలని ఇప్పటికే ఇంకో పారిశ్రామిక వేత్త పివిపి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అదే పార్టీ, అదేస్థానం టికెట్ కోసం జై రమేష్ ప్రయత్నిస్తున్నారని టాక్.

పివిపి ఇంట్రెస్ట్ గా వున్నారు కానీ, అలా అని మరీ పరుగెత్తిపోయి, టికెట్ కోసం కుస్తీ పట్టేయాలని అనుకోవడం లేదు. దాసరి జై రమేష్ టికెట్ కావాలంటే జగన్ కాస్త మొగ్గుచూపే అవకాశం వుంది. ఎందుకంటే ఆయనకు ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మద్ధతు వుంటుంది. అలాగే ఫుల్ సౌండ్ పార్టీ.

జైరమేష్ గతంలో ఉపేంద్ర మీద తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 

పచ్చ కోటలు బీటలు వారుతున్నాయా..?!