cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సీక్వెల్ రెడీ.. నిర్మాత కావాలి

సీక్వెల్ రెడీ.. నిర్మాత కావాలి

హిట్ సినిమాకు సీక్వెల్ తీస్తానంటే ఏ నిర్మాతైనా ముందుకొస్తాడు. ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ తీస్తానంటే ఎవరు ముందుకొస్తారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు అదే ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. తను తీసిన "అ!" అనే సినిమాకు సీక్వెల్ స్క్రిప్ట్ రాసుకున్నాడు ఈ దర్శకుడు. నిర్మాత కోసం వెయిటింగ్ అంటూ ప్రకటించాడు.

"ఏడాది కిందటే అ! సినిమా స్క్రిప్ట్ పూర్తిచేశాను. మొదటి భాగం కంటే మరింత క్రేజీగా స్క్రిప్ట్ వచ్చింది. కానీ దాన్ని సెట్స్ పైకి తీసుకురాలేకపోయాను. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ లో క్రేజీనెస్ ను మ్యాచ్ చేయగలిగిన నిర్మాత నాకు దొరకలేదు. నిజంగానే నేను చాలా ప్రయత్నించాను. కానీ నిర్మాత దొరకలేదు."

స్క్రిప్ట్ నచ్చడంతో హీరో నాని ఏకంగా నిర్మాతగా మారాడు. వాల్ పోస్టర్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి "అ!" సినిమా తీశాడు. విమర్శకుల మెప్పు అయితే పొందగలిగాడు కానీ డబ్బులు మాత్రం రాలేదు. అందుకే అతడు "అ!" సీక్వెల్ కు దూరంగా ఉన్నాడు. ఇదే విషయాన్ని ప్రశాంత్ పరోక్షంగా చెప్పినట్టయింది.

నిజానికి ఒరిజినల్ తీసిన నిర్మాతే, సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తాడు. కానీ ఇక్కడ నాని సీక్వెల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ప్రశాంత్ సినిమా కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. చివరికి ఇతడు పార్ట్ టైమ్ డైరక్ట్ చేసి తీసిన దటీజ్ మహాలక్ష్మి కూడా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. మధ్యలో వచ్చిన కల్కి కూడా ఫ్లాప్ అయింది.

ఫ్యాన్స్ తో రచ్చ చేసిన విజయ్ దేవరకొండ