Advertisement

Advertisement


Home > Movies - Movie News

బెంగాలీ బ్యూటీ బోల్తా

 బెంగాలీ బ్యూటీ బోల్తా

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్‌పై మ‌రో బాలీవుడ్ బ్యూటీ రూపా ద‌త్తా లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది. ఇప్ప‌టికే న‌టి పాయ‌ల్ ఘోష్ చేసిన లైంగిక ఆరోప‌ణ‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్‌లో రేగుతున్న ఆ మంట‌లు చ‌ల్లార‌క‌నే ...వాటికి ఆజ్యం పోసేందుకే అన్న‌ట్టు రూపా ఆరోప‌ణ‌లున్నాయి. ఈ సంద‌ర్భంగా 2014 నాటి ఫేస్‌బుక్ మెసేజ్‌ల స్క్రీన్ షాట్ల‌ను ట్విట‌ర్ల‌ను ఆమె షేర్ చేసింది.

మహిళలను గౌరవించని అతడితో తాను మాట్లాడ్డం మానేసిన‌ట్టు ఆమె పేర్కొంది. పాయల్ ఘోష్ లైంగిక ఆరోప‌ణ‌ల‌ను ఆమె స‌మ‌ర్థించింది. అనురాగ్‌పై పాయ‌ల్ ఆరోపణలు సరైనవే, అతడిని కఠినంగా శిక్షించాలని కూడా రూపా ద‌త్తా డిమాండ్ చేసింది. డ్రగ్స్ తీసుకోవడమే కాక, ఇతరులకు కూడా వాటిని సరఫరా చేస్తుంటాడని తీవ్ర ఆరోపణలు చేయ‌డం బాలీవుడ్‌ను క‌ల‌వ‌ర‌పా టుకు గురి చేస్తోంది.

ఇదిలా ఉంటే రూపా ద‌త్తాపై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. అనురాగ్ క‌శ్య‌ప్ పేరు విష‌యంలో ఆమె బోల్తా ప‌డింది. అనురాగ్ స‌ఫ‌ర్ అనే వ్య‌క్తి ఫేస్‌బుక్‌లో అనురాగ్ క‌శ్య‌ప్ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అయితే అనురాగ్ క‌శ్య‌ప్ పేరుతో ఉండ‌డంతో పాటు ఆ మెసేజ్‌లను చూసి రూపా పొర‌పాటు ప‌డ్డాడు. ఒక చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రూపా మాట్లాడుతూ ఇంత వ‌ర‌కూ తాను క‌శ్య‌ప్‌ను వ్య‌క్తిగ‌తంగా క‌ల‌వ‌లేద‌ని, కానీ అత‌ని చాట్స్ ఆధారంగానే ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు.

అయితే ఆ మెసేజ్‌లు చేసిన అనురాగ్ సఫర్ 2010లో, 2016లో తన పేరుపై స్ప‌ష్ట‌త ఇచ్చాడు. తాను డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌ను కానే కాద‌ని తేల్చి చెప్పాడు.  2009 వరకు తన యూజర్ నేమ్స్‌లలో కశ్యప్ పేరును ఉపయోగించడంతోనే ఈ గందరగోళం ఏర్ప డినట్టు ఇప్పుడు బ‌య‌ట‌ప‌డుతోంది. స‌ద‌రు అనురాగ్ స‌ఫ‌ర్‌ ఐర్లండ్‌లో ఉంటాడని స‌మాచారం. కానీ ఇవేవీ తెలుసుకోకుండా అనురాగ్‌పై లైంగిక ఆరోప‌ణ‌లు చేయ‌డంపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. 

ఒక ప్ర‌ముఖ వ్య‌క్తిగ‌త గురించి తీవ్ర ఆరోప‌ణ‌లు చేసే ముందు ... నిజానిజాలు తెలుసుకునే అవ‌స‌రం లేదా అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. 

చంద్రబాబు రాజకీయ జీవితంలో రెండో తప్పు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?