cloudfront

Advertisement


Home > Movies - Movie News

బయోపిక్ లో కూడా బీభత్సం చూపిస్తాడట

బయోపిక్ లో కూడా బీభత్సం చూపిస్తాడట

బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. యాక్షన్ సబ్జెక్ట్ తప్ప మరోరకమైన సినిమా చేయలేడు ఈ దర్శకుడు. అలాంటి బోయపాటి కూడా బయోపిక్ పై మనసుపడ్డాడు. అవును.. బయోపిక్ తీస్తానంటున్నాడు బోయపాటి. అయితే కండిషన్స్ అప్లయ్ అంటున్నాడు.

"బయోపిక్ గ్యారెంటీగా చేస్తాను. కానీ ఆ బయోపిక్ లో కూడా దమ్ము ఉంటుంది. యాక్షన్ ఉంటుంది. అలాంటి బయోపిక్ చేస్తాను. చేసేది బయోపిక్ అయినా అందులో నా మార్క్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటాను."

బయోపిక్ అంటేనే జీవిత చరిత్ర గురించి చెప్పడం. బోయపాటి మార్క్ యాక్షన్ తో ఎవరి జీవితాలు ఉండవు. కానీ అలాంటి జీవితాన్ని వెదికి పట్టుకుంటానంటున్నాడు ఈ డైరక్టర్. తను నమ్ముకున్న యాక్షన్ జానర్ నుంచి మాత్రం బయటకొచ్చేది లేదని తెగేసి చెబుతున్నాడు.

"యాక్షన్ నుంచి బయటకొచ్చే ఛాన్స్ లేదు. చిన్న సినిమా, స్మూత్ కథల సినిమా నేను చేయలేను. నావల్ల కాదు. జానర్స్ మారుస్తాను కానీ యాక్షన్ మాత్రం మిస్ అవ్వను. నా సినిమాల్లో కథలు మారుతుంటాయి కానీ అందులో యాక్షన్ మిస్ అవ్వదు. వంద రూపాయల్లో 25 రూపాయలు నా మార్క్ యాక్షన్ గ్యారెంటీ."

బాలకృష్ణతో చేయబోయే సినిమాపై మాత్రం బోయపాటి స్పందించలేదు. ఆ సినిమా ఇంకా పక్కా అవ్వలేదు అనే అర్థంవచ్చేలా రియాక్ట్ అయ్యాడు. దర్శకులంతా నిర్మాతలుగా మారుతున్న ఈ తరుణంలో తనకు మాత్రం అలాంటి ఉద్దేశాలు లేవని స్పష్టంచేసిన బోయపాటి, తన అసిస్టెంట్లను మాత్రం దర్శకులుగా మారుస్తానంటున్నాడు.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది