cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సిరివెన్నెల ఇంట్లో గొడ‌వ‌లు, డిబేట్లు...ఎందుకంటే?

సిరివెన్నెల ఇంట్లో గొడ‌వ‌లు, డిబేట్లు...ఎందుకంటే?

సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న గొప్ప పాట‌ల ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ఈ సినిమాకు ఆయ‌న రాసిన ప్ర‌తి పాట ఓ ఆణిముత్యం అంటే అతిశ‌యోక్తి కాదు. కొండ‌ల్ని కూడా క‌రిగించ‌గ‌ల శ‌క్తి సంగీతానికి ఉంటుందంటే ....అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా సిరివెన్నెల పాట‌ల్నే చెప్పుకోవ‌చ్చు. 

అలాంటి గొప్ప ర‌చ‌యిత ఇంట్లో గొడ‌వ‌లు, డిబేట్లు జ‌రుగుతున్నాయి. ఈ విష‌యాన్ని సిరివెన్నెల చిన్న‌ కుమారుడు రాజా చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కూ ఏమా గొడ‌వ‌లు, డిబేట్ల క‌థా? అని తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారా? అయితే ఈ క‌థ‌నంలోకి ప‌దండి.

ఇటీవ‌లే సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి త‌న‌యుడు రాజా, వెంక‌ట‌ల‌క్ష్మి హిమ‌బిందుతో క‌లిసి ఏడ‌డుగులు న‌డిచారు. రాజా మంచి న‌టుడు. అంత‌కు ముందు సాప్ట్‌వేర్ ప్రొఫెష‌న్‌లో ఉన్నారు. కానీ అందులో సంపాద‌న త‌ప్ప సంతోషాన్ని పొంద‌లేక‌పోయారు. దీంతో జీవితంలో ఏదో అసంతృప్తి.  ఈ నేప‌థ్యంలో త‌న తండ్రి కీర్తిప్ర‌తిష్ట‌లు సంపాదించుకున్న సినిమా రంగంలో, త‌న అదృష్టాన్ని ప‌రీక్ష‌కు పెట్టారాయ‌న‌. మంచి న‌టుడిగా గుర్తింపు పొందారు.

దీపావ‌ళి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఓ చాన‌ల్‌కు సిరివెన్నెల త‌న‌యుడు, కోడ‌లు క‌లిసి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా స‌ర‌దాగా ముచ్చ‌ట్లు చెప్పారు. ల‌క్ష్మి అని పిలుస్తుంటే ఎవ‌ర్నో అనుకుని త‌న భార్య ప‌ట్టించుకోకుండా వెళ్లేపోయేద‌ని సిరివెన్నెల త‌న‌యుడు రాజా చెప్పారు. దీనికి కార‌ణం కూడా ఆయ‌న వివ‌రించారు.

పెళ్లి కాక ముందు సిరివెన్నెల కోడలిని అంద‌రూ బిందు అనే పిలిచేవార‌న్నారు. అయితే త‌న‌కా విష‌యం తెలియ‌క ఆమె పేరులోని ల‌క్ష్మితో పిలిచిన‌ట్టు అత‌ను తెలిపారు.  త‌న భార్య ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అస‌లు విష‌యం ఆరా తీసిన‌ట్టు చెప్పారు. వెంక‌ట‌ల‌క్ష్మి హిమ‌బిందులోని ల‌క్ష్మిని మాత్ర‌మే తీసుకుని ముద్దుగా పిలిచిన‌ట్టు వివ‌రించాన‌న్నారు. దీంతో అంద‌రూ త‌న‌ను ల‌క్ష్మి అని పిలుస్తున్న‌ట్టు రాజా చెప్పుకొచ్చారు.  

ల‌క్ష్మిలో క‌లుపుగోలు త‌నం త‌న‌కు బాగా న‌చ్చిన‌ట్టు రాజా చెప్పారు. అలాగే త‌న భ‌ర్త ఏ ప‌ని చేసినా క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా చేస్తార‌ని, ఆయ‌న‌లోని క్ర‌మ‌శిక్ష‌ణ త‌న‌కు బాగా న‌చ్చుతుంద‌ని ల‌క్ష్మి చెప్పారు.  త‌ల్లికి కోడ‌లు తేవాల‌ని తాను ఆరాట ప‌డితే, ల‌క్ష్మి కూతురైంద‌ని రాజా మురిపెంగా చెప్పారు.  తండ్రి ద‌గ్గ‌ర వ్య‌క్తిగ‌తంగా క‌మిట్‌మెంట్‌, వృత్తి ప‌ట్ల ప్యాష‌న్ నేర్చుకున్న‌ట్టు రాజా తెలిపారు. అలాగే త‌ల్లి నుంచి క్ర‌మ‌శిక్ష‌ణ‌ను అల‌వ‌ర‌చుకున్న‌ట్టు చెప్పారు.

త‌న‌కు యాక్టింగ్‌ తర్వాత ఫిట్‌నెస్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని రాజా తెలిపారు.  అయితే త‌న కిష్టమైన పనే చేస్తాను కాబట్టి ఎప్పుడూ సెలక్టివ్‌ గా ఉంటానన్నారు. తాను ఫిట్‌నెస్ అంటే విప‌రీత‌మైన మోజు కాబట్టి ఇలా ఉండాలి, అలా తినాలి అని చెప్తానన్నారు. 

ఇలా చెప్ప‌డం వ‌ల్ల ఇంట్లో గొడ‌వ‌లు, డిబేట్ల‌కు దారి తీస్తోంద‌ని సిరివెన్నెల త‌న‌యుడు స‌ర‌దాగా చెప్పుకొచ్చారు. ఇద‌న్న మాట మ‌న కాల‌పు గొప్ప పాట‌ల ర‌చ‌యిత సిరివెన్నెల ఇంట్లో గొడ‌వ‌లు, డిబేట్ల‌కు సంబంధించి క‌థాక‌మామీషూ!

నాకు పెగ్గు అలవాటు లేదు

 


×