Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రముఖ టీవీస్టార్ ఆవేద‌న అర్థం చేసుకోరా...

ప్రముఖ టీవీస్టార్ ఆవేద‌న అర్థం చేసుకోరా...

దివ్యాంక త్రిపాఠి....ప్ర‌ముఖ టీవీ న‌టి. మ‌నం మ‌నుషులుగా మాన‌వ‌త్వాన్ని కోల్పోకండి అంటూ ప్ర‌జ‌ల‌కు హిత‌వు ప‌లుకుతూ ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటుగా స్పందించారు. ఇంత‌కూ ఆమెకు కోపం తెప్పించే త‌ప్పు ప‌ని ప్ర‌జ‌లు ఏం చేశార‌నే అనుమానం ప్ర‌తి ఒక్క‌రికీ క‌ల‌గ‌డం స‌హ‌జం. ఇదంతా క‌రోనా చేసిన మాయే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

దివ్యాంక త్రిపాఠి సోద‌రుడు విమాన ఫైలెట్‌. అయితే ఆమె సోద‌రుడితో పాటు త‌ల్లికి క‌రోనా సోకింద‌ని సోష‌ల్ మీడియాలో కొంద‌రు ప్ర‌చారం చేయ‌డంతో....దివ్యాంక‌కు కోపం తెప్పించింది. దీంతో ఆమె సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు.

‘నా సోదరుడికి ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేకున్నా ముందుజాగ్రత్త చర్యగా ఇతర విమానయాన ఉద్యోగుల్లాగే అతను కూడా హోంక్వారంటైన్‌లో ఉన్నాడు. కరోనావైరస్ షేమింగ్ ఆపండి, మనం మనుషులుగా మానవత్వాన్ని కోల్పోకండి’ అని ఆమె తన ఇన్ స్టాగ్రాంలో  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అంతేకాదు, ఆమె త‌న సుదీర్ఘ పోస్టింగ్‌లో మ‌రిన్ని విష‌యాలు వెల్లడించారు. జ‌నానికి మ‌రింత స్ప‌ష్ట‌త ఇచ్చారు.

‘ ప్ర‌స్తుత విప‌త్కర ప‌రిస్థితుల్లో నా తండ్రి తన జీవితాన్ని పణంగా పెడుతూ మెడికల్ స్టోరులో ప్రజలకు ఔషధాలు అందిస్తున్నారు. నా సోదరుడు విమాన పైలెట్ గా  విమానాలను నడుపుతూ చాలామంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాడు. ఇలా సేవలందిస్తున్న వారిని గౌరవంగా బ‌త‌క‌నివ్వండి. కరోనా ప్రబలుతున్న ఆపత్కాలంలో ప్రజలకు సేవ చేస్తున్న యోధులకు గౌరవం ఇవ్వండి, కరోనా షేమింగ్ చేయొద్దు’’ అని దివ్వాంకా త్రిపాఠి తన పోస్టులో కోరారు.

దివ్యాంక‌త్రిపాఠి పోస్ట్ గురించి ప్ర‌తి ఒక్క‌రూ సానుకూలంగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఒక వైపు క‌రోనా భ‌య‌పెడుతుంటే...మ‌రోవైపు దివ్యాంక చెబుతున్న‌ట్టు, సేవ చేస్తున్న ఆమె కుటుంబ స‌భ్యులను అవ‌మానించ‌డం మ‌న‌ల్ని మ‌నం కించ‌ప‌ర‌చుకోవ‌డమే.

ఏప్రిల్ 7వ తేదీకి కేసులన్నీ ఖతం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?