cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరోల భార్య‌ల నిర్ణ‌యాల‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌

హీరోల భార్య‌ల నిర్ణ‌యాల‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌

హీరోల భార్య‌ల నిర్ణ‌యాల గురించి హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేశారు. గ‌తంలో ఎవ‌రూ చెప్ప‌ని అంశాల్ని ఆమె తెర‌పైకి తెచ్చారు. హీరోయిన్ల ఎంపిక‌పై హీరోల భార్య‌ల అభిప్రాయాలుంటాయ‌ని తాప్సీ చెప్పిన త‌ర్వాతే తెలిసొచ్చింది. 

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన తొలి రోజుల్లో తానెదుర్కున్న అవ‌మానాల గురించి ఆమె చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లో త‌న‌ను హీరోయిన్‌గా తీసుకోవ‌డానికి నిర్మాత‌లు ఎందుకు ఇష్ట‌ప‌డ‌లేదో తాప్సీ వెల్ల‌డించారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాప్సీ ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు. మ‌రీ ముఖ్యంగా తాప్సీ అందంగా లేద‌ని హీరోయిన్ భార్య‌లు చెప్పేవార‌ని, అందుకే త‌మ భ‌ర్త‌ల స‌ర‌స‌న ఎంపిక చేయ‌వ‌ద్ద‌ని సూచించే వార‌ని ఆమె తాజా ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంట‌ర్వ్యూలో ఆమె ఏమ‌న్నారంటే...

"చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నా ప్ర‌స్థానం అంత సుల‌భంగా సాగ‌లేదు. రావ‌డం రావ‌డంతోనే అవ‌మానాలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. నేను అందంగా లేన‌ని హీరోల భార్య‌లు ఇష్ట‌ప‌డేవారు కాదు. అందంగా లేని న‌న్ను వాళ్ల భ‌ర్త‌ల ప‌క్క‌న హీరోయిన్‌గా చూడ‌డం అవ‌మానంగా భావించే వారు. హీరోల భార్య‌ల ఒత్తిడితో కొంద‌రు నిర్మాత‌లు న‌న్ను హీరోయిన్‌గా తీసుకోడానికి ఇష్ట‌ప‌డ‌లేదు.  

ఒక సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌ సీన్ కంటే నా ఇంట్రడక్షన్‌ సీన్‌ బాగా వచ్చింది. దాంతో డైరెక్టర్‌కు చెప్పి ఆ హీరో నా సీన్‌ను మార్చేశాడు. నాకు తెలిసి ఇలాంటివి ఎన్నో జరిగాయి. నాకు తెలియకుండా ఇంకెన్ని జరిగాయో" అని  తాప్సీ చెప్పుకొచ్చారు.

ఇలాంటి ఆరోప‌ణ‌లు గ‌తంలో ఎప్పుడూ విన్న దాఖ‌లాలు లేవు. ప్ర‌స్తుతం తాప్సీ అన్న మాట‌లు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీశాయి. ఇక ఇలాంటి అనుభ‌వాలు మ‌రెవ‌రికైనా ఎదుర‌య్యాయా? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు త‌లెత్తుతున్నాయి. 

విజన్ 2020 అంటే అర్థం చేసుకోలేకపోయాం

 


×