Advertisement

Advertisement


Home > Movies - Movie News

కుర‌చ బ‌ట్ట‌లేస్తే...తిట్ట‌క ముద్దు పెట్టుకుంటారా అమ్మ‌డు!

కుర‌చ బ‌ట్ట‌లేస్తే...తిట్ట‌క ముద్దు పెట్టుకుంటారా అమ్మ‌డు!

ఒక దెబ్బ కొట్టినా, తిట్టు తిట్టినోళ్ల‌ను, ఒక ముద్ద అన్నం పెట్టిన వాళ్ల‌ను మ‌నిషి అన్న వాడెవ‌డూ జీవితంలో మ‌రిచిపోర‌ని అంటారు. త‌ల్లిదండ్రులైతే బిడ్డ‌ల శ్రేయ‌స్సు కోరి దెబ్బ కొట్ట‌డ‌మో, తిట్ట‌డ‌మో చేస్తుంటారు. ఆ క్ష‌ణంలో త‌ల్లిదండ్రుల‌పై కోపం వ‌చ్చినా...ఆ త‌ర్వాత కాలంలో వాటి విలువ ఏంటో తెలిసొస్తుంది.

ప్రియాంకా చోప్రాకు చిన్న‌ప్పుడు తండ్రి తిట్ట‌డం ఇప్ప‌టికీ బాగా గుర్తు పెట్టుకున్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి  గ్లోబ‌ల్‌స్టార్‌గా ఎదిగిన ప్రియాంకా చోప్రాకు తండ్రి అశోక్‌ చోప్రాతో విడ‌దీయ‌లేని అనుబంధం. తండ్రీకూతుళ్ల మ‌ధ్య మాన‌సిక అనుబంధం ఎంత దృఢ‌మైందో చెప్ప‌డానికి ప్రియాంక చోప్రా చేతిపై  `డాడీస్ లిటిల్ గర్ల్` అని టాటూ వేసుకోవ‌డ‌మే నిద‌ర్శ‌నం.

తండ్రి త‌ర్వాతే త‌న‌కెవ‌రైనా అని ఆమె ప‌దేప‌దే చెప్పుకునే వారు. త‌న  బెస్ట్ ఫ్రెండ్ అని గ‌ర్వంగా చెప్పుకునే  ప్రియాంక... తండ్రితో గతంలో  జరిగిన గొడవ , త‌న‌ను తిట్టిన విష‌యాల‌ను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

"పదహారేళ్ల వయసులో సంగ‌తి. అప్ప‌ట్లో ఓ సారి అమెరికా నుంచి తిరిగి వచ్చినపుడు నా బట్టలు చూసి  నాన్న షాకయ్యారు. అప్పుడు నేను చాలా కురచైన బిగుతు దుస్తులు ధరించి ఉన్నాను. చాలా మంది అబ్బాయిలు నా వైపే చూస్తుండడాన్ని మా నాన్నగ్ర‌హించి సహించలేకపోయారు. దీంతో నాపై ఇంతెత్తున లేచారు. ఇలాంటి బట్టలు వేసుకుంటావా అని నన్ను తిట్టారు.   బట్టల విషయంలో మా ఇద్దరికీ చాలా సేపు గొడవ జరిగింది" అని ప్రియాంక గుర్తు చేసుకున్నారు.

కాగా ప్రియాంక తండ్రి అశోక్ 2013లో కాలేయ కేన్స‌ర్‌తో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. కానీ నాన్న త‌న యోగ‌క్షేమాల‌ను కోరిన వ్య‌క్తిగా జీవితంలో నేర్పిన పాఠాలు మాత్రం ఆమె మ‌న‌సులో  భ‌ద్రంగా దాచుకున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నం ఆమె గుర్తు చేసుకున్న ఈ జ్ఞాప‌కాలే నిద‌ర్శ‌నం.

ఆంధ్రాలో కRoన ని జయించిన యువకుడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?