Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్ర‌ముఖ బుల్లితెర అంద‌గ‌త్తె అరెస్ట్‌

ప్ర‌ముఖ బుల్లితెర అంద‌గ‌త్తె అరెస్ట్‌

తీగ లాగితే డొంక క‌దిలిన చందంగా సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసులో విచార‌ణ ఇత‌రేత‌ర నేరాల‌ను బ‌య‌ట‌కు తెస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాలు స‌మాజానికి తెలిసొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా బుల్లితెర అంద‌గ‌త్తె, ప్ర‌ముఖ హిందీ సీరియ‌ల్స్ న‌టి ప్రీతికా చౌహాన్ (30) అరెస్ట్ కావ‌డం తీవ్ర సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాల‌తో ఆమెకు సంబంధాలున్నాయ‌ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు నిర్ధారించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమెతో పాటు డ్ర‌గ్స్‌కు బానిసైన మ‌రో న‌లుగురిని ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

శ‌నివారం రాత్రి ముంబ‌య్‌లోని వ‌ర్సోవా, మ‌చ్చిమార్ కాల‌నీలో ఓ ఇంట్లో గంజాయి కొంటున్న ప్రీతికా చౌహాన్‌, ఫైజ‌ల్‌ల‌ను అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా  వారి నుంచి 99 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  వారిద్దరిని కోర్టులో హాజరు పర‌చ‌గా వ‌చ్చే నెల‌ 8వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు.

ప్రీతికా చౌహాన్‌ది హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌. సినిమాల‌పై మోజుతో బాలీవుడ్ వైపు న‌డిపించాయి. 2016లో విడుద‌లైన జ‌మీలా సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. అలాగే సినిమాల కంటే హిందీ సీరియ‌ల్స్‌లో ఆమె ఎక్కువ‌గా న‌టించారు.

హిందీ సీరియ‌ల్స్ న‌టిగానే బాగా గుర్తింపు పొందారు. దేవోకి దేవ్‌ మహదేవ్‌, సంకట్‌ మోచన్‌ మహాబలి హనుమాన్‌, మా వైష్టోదేవీ, సంతోషీ దేవీ, సీఐడీ, సావ్‌ధాన్‌ ఇండియా త‌దిత‌ర‌ హిందీ సీరియళ్లలో ఆమె నటించారు. హిందీ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి బాగా ప‌రిచ‌యం ఉన్న సెల‌బ్రిటీ కావ‌డంతో ఆమె అరెస్ట్ క‌ల‌క‌లం రేపింది.

పవన్ కళ్యాణ్ వచ్చినా, ఏ కళ్యాణ్ వచ్చినా భయపడేది లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?