Advertisement

Advertisement


Home > Movies - Movie News

వ‌చ్చే నెల ముహూర్తం...దీవించండి -రేణూదేశాయ్‌

వ‌చ్చే నెల ముహూర్తం...దీవించండి -రేణూదేశాయ్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాజీ భార్య‌, హీరోయిన్ రేణూదేశాయ్ త‌న‌కు దీవెన‌లు అందించాల‌ని వేడుకుంటున్నారు. ఇంత‌కూ దీవెన‌లు ఎందుక‌నే క‌దా అంద‌రి అనుమానం?  తెలుసుకునేందుకే వెళ్దాం. రేణూదేశాయ్ కేవ‌లం ఆర్టిస్ట్ మాత్ర‌మే కాదు ...ఆమె ఓ సామాజిక కార్య‌క‌ర్త కూడా. గ‌తంలో ఆమె న‌టించిన సినిమాలు హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే.

తాజాగా మ‌రోసారి చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు మ‌న ముందుకొస్తున్నారు. సినిమాల్లో తిరిగి రీఎంట్రీ ఇస్తార‌ని ప‌లుమార్లు ప్ర‌చారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ...అది ఆచ‌ర‌ణ‌కు నోచుకోలేదు. తాజాగా రీఎంట్రీపై రేణూనే స్వ‌యంగా క్లారిటీ ఇచ్చారు.

కృష్ణ‌మామిడాల డైరెక్ష‌న్ లో వ‌స్తున్న వెబ్ సిరీస్‌లో న‌టించ‌నున్న‌ట్టు రేణూ దేశాయ్ ప్ర‌క‌టించారు.  ఈ వెబ్ సిరీస్ షూటింగ్ చేప‌ట్టేందుకు వ‌చ్చే నెల ముహూర్తం  పెట్టిన విష‌యాన్ని రేణూ త‌న ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్ల‌డించారు.  ఈ సంద‌ర్భంగా రేణూ పోస్టు క‌థాక‌మామీషు ఏంటో చూద్దాం.

‘మ‌ళ్లీ కెమెరా ముందుకొస్తున్నాను. నేను ఓ అంద‌మైన వెబ్ సిరీస్‌కు సంత‌కం చేశాన‌ని ప్ర‌క‌టిస్తున్నందుకు సంతోషంగా, ఎక్జ‌యిటింగ్ గా ఉంది. వ‌చ్చే నెల‌లో షూటింగ్ మొద‌ల‌వుతుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తా. స‌త్యాన్వేష‌ణ‌లో ఉన్న ఓ మ‌హిళ ప్ర‌యాణానికి మీ దీవెన‌లు, ప్రేమ‌ను అందించాల‌ని కోరుతున్నా’ అని పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో రేణూ ఎంట్రీపై స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టైంది. రీఎంట్రీతో న‌ట‌న‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయ‌నున్నారామె.

ఈవిషయం బాబు&కో ఎప్పుడు గమనిస్తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?