Advertisement

Advertisement


Home > Movies - Movie News

అభిమానుల‌ను హ‌ర్ట్ చేసిన బాలీవుడ్‌ భామ న్యూ లుక్

అభిమానుల‌ను హ‌ర్ట్ చేసిన బాలీవుడ్‌ భామ న్యూ లుక్

కొంత మంది సినీ సెల‌బ్రిటీలు మొద‌టి నుంచి త‌మ కంటూ ఓ ప్ర‌త్యేక వ‌స్త్ర‌ధార‌ణ‌లో క‌నిపిస్తూ ఉంటారు. ఆ డ్రెస్‌, మాట తీరు...ఇలా ఏదో ఒక ప్ర‌త్యేక‌త‌తో అభిమానుల‌ను సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ల‌ని అలా చూస్తేనే అభిమానుల‌కు ఇష్టం. లేదంటే ఏ మాత్రం తేడా వ‌చ్చినా అభిమానులు హ‌ర్ట్ అవుతారు.

ఇలాంటి అనుభ‌వ‌మే బాలీవుడ్ భామ మ‌లైకా అరోరా విష‌యంలో ఎదుర‌వుతోంది. 46 ఏళ్ల వ‌య‌సులోనూ ఫిట్‌నెస్‌తో కుర్ర‌కారు హృద‌యాల్లో అల‌జ‌డి రేపుతూ...త‌న‌కంటూ ప్ర‌త్యేక అభిమానుల‌ను క‌లిగి ఉన్నారామె. అందంతో పాటు నిత్యం ఏదో ఒక రూమ‌ర్‌కు అవ‌కాశం ఇచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం మ‌లైకా అరోరా ప్ర‌త్యేక‌త‌.

లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ ఆమె వార్త‌ల్లో ఎక్కారు. ఒక మాట‌లో చెప్పాలంటే న్యూస్ క్రియేట‌ర్‌. లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఆమె స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంట్లో స్వ‌యం పాకాన్ని ఆమె సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. 

తాజాగా బాలీవుడ్ భామ మలైకా తన సమయాన్ని లడ్డూలు తయారు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు.  ఇంట్లో ఓపిగ్గా ల‌డ్డూలు తయారీ చేస్తూ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్‌చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఎంతో మందికి న‌చ్చిన ఆ వీడియో... మలైకా అభిమానులను మాత్రం తీవ్ర నిరాశ ప‌రుస్తోంది. అంతేకాదు, తాము అభిమానించే మ‌లైకాను ఈ యాంగిల్‌లో చూడాల‌నుకోడం లేద‌ని నొచ్చుకుంటూ చెబుతున్నారు. ఎప్పుడూ హాట్‌హాట్‌గా క‌నిపిస్తూ, క‌వ్విస్తూ కనిపించే మలైకా... ఇప్పుడు ఆంటీలాగా కనిపించ‌డం ఏంట‌ని ఆమె అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.   తాము అభిమానించే మ‌లైకా...త‌మ‌ను పిచ్చెక్కించే, క‌వ్వించే లుక్‌లో ప్ర‌త్య‌క్షం కావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. 

లాక్ డౌన్ ఎత్తేస్తున్నారా ?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?