Advertisement

Advertisement


Home > Movies - Movie News

సినిమాల్లేవు.. కానీ సమంతకు ఆదాయం ఫుల్లు

సినిమాల్లేవు.. కానీ సమంతకు ఆదాయం ఫుల్లు

సమంత ఈమధ్య సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. లాక్‌డౌన్‌కి ముందు చేస్తానని ఒప్పుకున్న సినిమానుంచి కూడా ఆమె వైదొలగింది. అక్కినేని హీరోలందరూ సెట్స్‌కి తిరిగి వెళ్లిపోగా సమంత మాత్రం ఇంకా లాక్‌డౌన్ మూడ్‌లోనే వుంది. 

ఇంకా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు పెడుతూ, ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ సమంత కాలక్షేపం చేస్తోంది. మళ్లీ నటించేందుకు ఆసక్తి వుందో లేదో తెలియదు కానీ ఖాళీగా వున్నా సమంత ఆదాయానికి మాత్రం లోటు లేదు. 

తనకు సౌత్ ఇండియాలో వున్న పాపులారిటీ దృష్ట్యా పలు సంస్థలు ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుంటూనే వున్నాయి. ఈ యాడ్స్‌తోనే సమంత ఏడాదికి భారీ ఆదాయం కూడగడుతోంది. ఈ బ్రాండ్ అండార్స్‌మెంట్లు కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టినా కానీ సమంతకు లక్షల్లో వచ్చి పడుతుంటాయి. 

తెలుగు హీరోలలో బ్రాండ్ డీల్స్‌తో అత్యధికంగా ఆర్జించేది మహేష్ అయితే హీరోయిన్లలో సమంతే బ్రాండ్ క్వీన్. ఇంకా చెప్పాలంటే ఆమెకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా వచ్చే ఆదాయం కొందరు టాప్ హీరోలకు కూడా రాదు. 

పవన్ కళ్యాణ్ వచ్చినా, ఏ కళ్యాణ్ వచ్చినా భయపడేది లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?