
హాట్ యాంకర్, వెండితెర రంగమ్మత్త అనసూయ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఓ నెటిజన్ కామెంట్ ఆమె నోట వాడు, వీడు అని పరుషంగా మాట్లాడేలా చేశాయి. కోపంలో నెటిజన్‌పై అనసూయ చాలా చాలా మాట్లాడేశారు. తిట్ల పురాణానికి దిగారు. ఇటీవల కాలంలో అనసూయ ఈ స్థాయిలో కోప్పడడం ఎప్పుడూ చూసి ఉండం. అసలేం జరిగిందంటే...
అనసూయ పుట్టిన రోజు మే 15. అంటే నిన్న అన్నమాట. తన పుట్టిన రోజు సందర్భంగా పోలీసు అధికారుల విజ్ఞప్తి మేరకు గర్భిణీలకు పౌష్టికాహారాన్ని ఆమె అందజేశారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం సోషల్ మీడియాలో ఆమె లైవ్‌లోకి వచ్చారు.
బుల్లితెర గ్లామర్ క్వీన్ అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పేదేముంది. దీంతో వేలాది మంది నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. నెటిజన్ల అభిమానానికి అనసూయ ఉప్పొంగిపోయారు. అయితే నెటిజన్లలో ఓ తుంటరి చేసిన కామెంట్‌కు అనసూయ తీవ్ర కోపోద్రిక్తురాలయ్యారు.
"ఇద్దరు పిల్లలకు తల్లివనే విషయాన్ని మర్చిపోయావా? కాస్త పద్ధతిగా డ్రెస్ వేసుకోవచ్చు కదా" అంటూ ఓ నెటిజన్ క్లాస్ తీసుకున్నాడు. ఆ మాటతో అనసూయ రగిలిపోయారు. ఆ నెటిజన్‌పై అనసూయలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
"ఇలాంటి వాళ్ల వల్లే `వాడు`, `వీడు` అనే పదాలు వస్తాయి. నువ్వు ఎవడివిరా నా డ్రెస్ గురించి మాట్లాడ్డానికి? అమ్మ అయితే ఆ డ్రెస్ వేసుకోవాలి..ఈ డ్రెస్ వేసుకోకూడదు అనే రూల్ ఉందా? అమ్మతనం గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? నా పుట్టిన రోజునాడు నాతో తిట్లు తినాలనుకున్నావా" అంటూ చిందులేశారు.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనసూయ డ్రెస్, నెటిజన్ కామెంట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పుట్టిన రోజు బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ హర్ట్ అయ్యారు.
విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం