cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఓరే ఇడియ‌ట్స్ లారా...పేలుతున్న హీరో ట్వీట్స్‌

ఓరే ఇడియ‌ట్స్ లారా...పేలుతున్న హీరో ట్వీట్స్‌

మంచు మ‌నోజ్‌...డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబు కుమారుడు. సినీ హీరో. ఇంటి పేరులో మంచు ఉందే త‌ప్ప‌...మాట‌లో మాత్రం ఫైర్‌. తాజాగా మంచు మ‌నోజ్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  ఓరే ఇడియ‌ట్స్ లారా...అంటూ మొద‌లు పెట్టిన ట్వీట్ హాట్ హాట్‌గా కొన‌సాగింది. దీనికంత‌టికి కార‌ణం క‌రోనానే.

క‌రోనాపై యుద్ధం చేస్తున్న త‌రుణంలో ప్ర‌ధాని మోడీ ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు దీపాలు లేదా కొవ్వొత్తులు...సెల్‌ఫోన్‌లో లైట్ అయినా ఆన్ చేయాల‌ని కోరారు. ప్ర‌ధాని సూచించిన మేర‌కు ఎవ‌రికి తోచిన‌ట్టు వాళ్లు దీపాలు వెలిగించారు. అయితే కొంద‌రు మాత్రం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు.

కొన్ని చోట్ల కొందరు దీన్ని దీపావళిలా క్రాకర్స్ పేల్చి హ‌ల్‌చ‌ల్ చేశారు. ఇది విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.  అలాంటి వాళ్ల‌ను సోష‌ల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తూ గ‌డ్డి పెడుతున్నారు.  హీరో మంచు మనోజ్ కూడా అలాంటి వాళ్ల‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశాడు.  ఆ ట్వీట్స్ కాస్తా హాట్‌గా ఉండ‌టంతో వైర‌ల్ అవుతున్నాయి.

‘ఓరే ఇడియట్స్ లారా.. క్రాకర్స్ కాల్చడం ఆపండిరా. అలా కాల్చమని ఎవ‌రూ అడగలేదురా. పాండిత్యం ఎక్కువైన ******* వారే ఇలా చేస్తున్నారు. దయచేసి గమనించండి. మనం మనుషులం.. మూర్ఖులం కాదు. ఈ క్రాకర్స్ చూస్తుంటే మనవాళ్లు కరోనాని కూడా సీఎం లేదంటే పీఎం చేసేస్తారనుకుంటా.. ఓరి **** బతుకు. మళ్లీ జై కరోనా అంట’ అంటూ తన మంచు మ‌నోజ్ చిట‌ప‌ట‌లాడాడు. క్రాక‌ర్స్‌లా పేలుతున్న మంచు ట్వీట్స్‌కు నెటిజన్ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌డం విశేషం. 

పారిశుధ్య కార్మికురాలి కాళ్ళు క‌డిగిన వైసీపీ ఎమ్మెల్యే