Advertisement


Home > Movies - Movie News
8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కలుస్తున్నారు

హీరో రామ్, ముద్దుగుమ్మ కాజల్ కలిసి ఇన్నేళ్ల కెరీర్ లో ఒకేఒక్కసారి నటించారు. ఆ సినిమా కాస్తా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ కనిపించలేదు. ఎట్టకేలకు రామ్ సరసన మరోసారి నటించేందుకు రెడీ అవుతోంది కాజల్. వీళ్లిద్దర్నీ హీరోహీరోయిన్లుగా పెట్టి ప్రవీణ్ సత్తార్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.

గరుడవేగ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు రామ్ కు ఇప్పటికే స్టోరీలైన్ వినిపించాడు. రామ్ కు కూడా అది నచ్చింది. దీంతో వెంటనే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే ప్రారంభంకాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నారు.

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్. ఈ మూవీ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ప్రవీణ్ సత్తారు సినిమా సెట్స్ పైకి వస్తుంది. గతంలో రామ్, కాజల్ కలిసి జస్ట్ గణేష్ అనే సినిమాలో నటించారు. మళ్లీ 8ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేయబోతున్న సినిమా ఇదే.