Advertisement

Advertisement


Home > Movies - Movie News

నెటిజ‌న్‌కి రోజా కూతురు షాకింగ్ రిప్లై

నెటిజ‌న్‌కి రోజా కూతురు షాకింగ్ రిప్లై

ఇంట‌ర్ నెట్ సౌక‌ర్యం అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత‌, ప్ర‌పంచ‌మంతా కుగ్రామ‌మైంది. ఒక‌ప్పుడు సినీ సెల‌బ్రిటీల‌ను చూడాల‌న్నా, మాట్లాడాల‌న్నా అసాధ్య‌మ‌ని అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు దూరాలు చెరిగిపోయాయి. 

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని త‌మకు ఇష్ట‌మైన, అయిష్ట‌మైన సినీ సెల‌బ్రిటీల‌తో అభిప్రాయాల‌ను స్వేచ్ఛ‌గా పంచుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ఒక‌ప్ప‌టి టాలీవుడ్ హీరోయిన్‌, ప్ర‌స్తుత వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా కూతురికి నెటిజ‌న్ కామెంట్ వైర‌ల్ అయ్యింది.

రోజా కూతురు అన్షు సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఇటీవ‌లే ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టింది. ఓ నెటిజ‌న్ రోజా కూతురికి వినూత్నంగా త‌న మ‌న‌సులో మాట చెప్పాడు. స్పానిష్ భాషలో ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు.  

అన్షు స్పందిస్తూ... ‘ఐ లవ్‌ యూ.. థాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చి షాక్‌కు గురి చేసింది. రోజా కూతురి స‌మాధానం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. తెలుగులో నాగార్జున సినిమాలంటే చాలా ఇష్ట‌మ‌ని అన్షు పేర్కొంది. 

ఇదిలా ఉండ‌గా త‌ల్లి రోజాను దృష్టిలో పెట్టుకుని ‘మీరు హీరోయిన్ అవుతారా’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు. దానికి నా సమాధానం ఒక్కటే.. నాకు తెలియదు.. అసలు నేను ఆ ఆలోచన కూడా చేయలేదు’ అని అన్షు స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. 

కానీ అన్షు న‌ట‌నంటే త‌న‌కిష్టం లేదనో, మ‌రొక‌టో చెప్ప‌క పోవ‌డంతో నెటిజ‌న్లు త‌మ‌వైన అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఏదో ఒక రోజు అన్షు వెండితెర‌పై త‌ప్ప‌క క‌నిపిస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?