Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆర్ఆర్ఆర్: పవన్ కంటే ఎన్టీఆర్ చాలా బెటర్!

ఆర్ఆర్ఆర్: పవన్ కంటే ఎన్టీఆర్ చాలా బెటర్!

సినీ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఏదైనా చర్చ మొదలైతే దానికి అంతూ పొంతూ ఉండదు. అందులోనూ కరోనా లాక్ డౌన్ టైమ్ కదా.. అందరూ బాగా ఖాళీగా ఉన్నారు, అందుకే నెట్టింట్లో ఓ రేంజ్ లో ఒకరినొకరు ఆటాడేసుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీలోని రామ్ చరణ్ వీడియోకు, సైరా ట్రయిలర్ కు ముడిపెడుతూ కొత్త రచ్చ స్టార్ట్ చేశారు.

రామ్ చరణ్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అద్భుతం అంటున్న అభిమానులు.. సైరా సినిమాకి పవన్ ఇచ్చిన వాయిస్ ఓవర్ మైనస్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. చిరంజీవి సినిమాకి సొంత తమ్ముడే మైనస్ గా నిలిస్తే.. రామ్ చరణ్ సినిమాకి నందమూరి హీరో ప్లస్ అయ్యాడని అంటున్నారు. ఒకరకంగా మెగాభిమానులను రెచ్చగొడుతున్నారు.

మెగాభిమానులు అనడం కంటే.. పవన్ అభిమానులు అనడం కరెక్టేమో. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ మొదలైనప్పటి నుంచి మెగాస్టార్ అభిమానులు, నందమూరి అభిమానుల మధ్య ఒకరకమైన బాండింగ్ ఏర్పడింది. సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంలో కూడా ఇద్దరు హీరోల అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వీడియో కూడా అంతే. ఈ వీడియోలో రామ్ చరణ్ కనిపించాడు, ఎన్టీఆర్ వినిపించాడు. అలా ఇద్దరూ హీరోలను బ్యాలెన్స్ చేస్తూ రాజమౌళి చేసిన ప్లానింగ్ మంచి ఫలితాన్నిచ్చింది.

రామ్ చరణ్ లుక్స్ తో మెగా ఫ్యాన్స్ సంబరపడ్డారు, ఎన్టీఆర్ డైలాగ్స్ తో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మధ్యలో పవన్ అభిమానుల్ని మాత్రం బాగా ఇరికించేశారు. వాస్తవానికి సైరా సినిమా టైమ్ లో చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్ కోసం పవన్ కల్యాణ్ తో ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పించారు. అయితే ఆ డబ్బింగ్ వ్యవహారంపై పెద్దగా కేర్ తీసుకున్నట్టు కనిపించ లేదు. పవన్ వాయిస్ ని కేవలం క్రేజ్ కోసం తీసుకున్నారంతే. ఆయనతో బాగా ప్రాక్టీస్ చేయిస్తే ఔట్ పుట్ మరింత బాగుండేదని అప్పట్లోనే ఓ టాక్ నడిచింది. కానీ ఎవరికీ ఏమీ పట్టనట్టు  అభిమానులంతా గుంభనంగా ఉన్నారు.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఓ రేంజ్ లో ఉండే సరికి పోలిక మొదలైంది. చిరంజీవిని పవన్ తేల్చేశారని, చరణ్ ను తారక్ బాగా ఎలివేట్  చేశాడని ఫ్యాన్ వార్ నడుస్తోంది.

క‌రొనా పై చిరు-నాగ్ పాట చూశారా?

ఏప్రిల్ 7వ తేదీకి కేసులన్నీ ఖతం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?