cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సింగ‌ర్ సునీత పెళ్లి ముచ్చ‌ట్లు

సింగ‌ర్ సునీత పెళ్లి ముచ్చ‌ట్లు

టాలీవుడ్ ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత పెళ్లిపై చాలా కాలంగా ర‌క‌ర‌కాలుగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఎట్ట‌కేల‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. వ్యాపార‌వేత్త రామ్ వీర‌ప‌నేనితో క‌లిసి ఆమె ఏడ‌డుగులు న‌డిచారు. వివాహ వేడుక‌కు అత్యంత స‌న్నిహితులు, కొంద‌రు ప్ర‌ముఖులు హాజ‌రై ఆశీర్వ‌దించారు. త‌న పెళ్లి వేడుక‌ను సునీత స్వ‌ర్గంతో పోల్చ‌డం గ‌మ‌నార్హం.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సునీత త‌న పెళ్లి ముచ్చ‌ట్లు, రామ్‌తో ప‌రిచ‌యం త‌దిత‌ర ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. రామ్‌తో క‌లిసి కొత్త జీవితం ప్రారంభించ‌డం త‌న అదృష్టంగా ఆమె చెప్పుకొచ్చారు. రామ్ త‌న‌కు చాలా ఏళ్ల‌గా తెలుసున‌న్నారు. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్స్‌ని రామ్ చూసుకునే వార‌ని సునీత వెల్ల‌డించారు.

సోష‌ల్ మీడియా పుణ్యాన త‌మ మ‌ధ్య ప‌రిచ‌యం క్ర‌మంగా పెరుగుతూ సాన్నిహిత్యం ఏర్ప‌డింద‌న్నారు. ఈ క్ర‌మంలో త‌మ బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌ని భావించామ‌న్నారు. ఇరు వైపు కుటుంబాల్లో ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకుని , అంద‌రి అంగీకారంతో పెళ్లి వైపు అడుగులు వేసిన‌ట్టు సునీత తెలిపారు. అయితే పెళ్లి చేసుకోవాల‌నే త‌లంపు వ‌చ్చిన‌ప్పుడు మొట్ట‌మొద‌ట పిల్ల‌ల భ‌విష్య‌త్‌పై ఆలోచించిన‌ట్టు సునీత తెలిపారు.

త‌న నిర్ణ‌యం వ‌ల్ల పిల్లలు ఇబ్బంది ప‌డ‌కూద‌ని అనేక సార్లు ఆలోచించిన‌ట్టు సునీత చెప్పారు. జీవితంలో ఎదుర‌య్యే ప్ర‌తి క‌ష్ట స‌మ‌యంలో తోడుగా నిలిచే వారు ఎంతో అవ‌స‌ర‌మ‌న్నారు. ఆ తోడు జీవిత భాగ‌స్వామి అయితే బాగుంటుంద‌ని భావించా న‌న్నారు. 

క‌ష్ట‌సుఖాల్లో అండ‌గా నిలిచే భాగ‌స్వామిగా రామ్ రూపంలో దొర‌క‌డం త‌న అదృష్టంగా సునీత ఆనందంగా చెప్పారు. రామ్‌ను చేసుకోవాల‌ని త‌న పిల్ల‌ల‌తో చెప్పిన‌ప్పుడు, వారిద్ద‌రూ త‌న‌ను కౌగిలించుకుని త‌మ సంతోషాన్ని, ఆమోదాన్ని వ్య‌క్తం చేశార‌న్నారు.

ఇంత బాగా అర్థం చేసుకునే పిల్ల‌లుండ‌డం త‌న అదృష్టంగా సునీత తెలిపారు. ఇక త‌ల్లిదండ్రుల విష‌యానికి వ‌స్తే ... పెళ్లి చేసుకోవాల‌ని వాళ్లు ఎప్ప‌టి నుంచో త‌న‌ను కోరుతున్నార‌ని చెప్పారు. 

రానున్న రోజుల్లో కొంద‌రిని క‌లిసేందుకు చిన్న‌చిన్న పార్టీలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు సునీత తెలిపారు. ఇవ‌న్నీ ముగిసిన త‌ర్వాత హ‌నీమూన్ గురించి ఆలోచిస్తామ‌న్నారు. ఇద్ద‌రం క‌లిసి ఎక్క‌డికైనా వెళ్తామ‌ని సునీత చెప్పుకొచ్చారు.  

దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు

ఈ సంక్రాంతి అల్లుడు నేనే 

 


×