Advertisement

Advertisement


Home > Movies - Movie News

కొన్నిదేశాల్లో విరామం దిశగా సీతా రామం..!

కొన్నిదేశాల్లో విరామం దిశగా సీతా రామం..!

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీతా రామం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. 

దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, ఈ సినిమాను ప్రెస్టీజియస్ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు, ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ గెస్ట్‌గా రావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

అయితే రిలీజ్‌కు మరొక రోజు మాత్రమే ఉండగా, సీతా రామం చిత్రానికి షాక్ ఎదురైంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెఢీ కాగా, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. 

ఈ సినిమాలో మతపరమైన సీన్స్ కొన్ని ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ తెలిపిందట. అయితే తమ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ మరోసారి సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లనుందట.

ఈ సినిమాలో స్టార్ బ్యూటీ రష్మిక మందన, సుమంత్, భూమిక వంటి పులువు స్టార్స్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో నిజంగానే బ్యాన్ చేస్తారా.. లేక అభ్యంతకరంగా ఉన్న సీన్స్‌ను తొలగించి అక్కడ రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

ఏదేమైనా రిలీజ్‌కు ముందుకు సీతా రామం సినిమాకు ఇది గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?