Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ సీక్రెట్ అత‌నికి మాత్ర‌మే తెలుసంటున్న నిహారిక‌

ఆ సీక్రెట్ అత‌నికి మాత్ర‌మే తెలుసంటున్న నిహారిక‌

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక న‌ట‌న‌తో పాటు మాట‌ల్లో కూడా రోజురోజుకూ మెచ్యూరిటీ క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న కెరీర్‌, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌న‌కు సంబంధించి అప్‌డేట్స్ ఆమె అందిస్తున్న విష‌యం తెలిసిందే. 

పెళ్లి త‌ర్వాత కూడా ఈ ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారామె. త‌న ఇష్టాయిష్టాల‌ను ప్రేమించే జీవిత భాగ‌స్వామి జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య రూపంలో దొర‌క‌డంతో నిహారిక ఆనందానికి అవ‌ధుల్లేవనే చెప్పాలి.

తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆమె షేర్ చేసిన ఓ పోస్టు వైర‌ల్ అవుతోంది. అందులోనూ ఆమె సీక్రెట్ గురించి ప్ర‌స్తావించ‌డం, అది కేవ‌లం అత‌నొక్క‌డికే తెలుసున‌ని పేర్కొన‌డం నెటిజ‌న్ల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. నెటిజ‌న్ల‌ను త‌న వైపు ఆక‌ట్టుకునే క‌ళ నిహారిక‌కు బాగా తెలిసిన‌ట్టుంది. తాజాగా అలాంటి పోస్టు గురించి త‌ప్ప‌క తెలుసుకోవాలి.

సెంటర్ ఫ్రెష్ యాడ్‌లో మాదిరి నోటికి తాళం వేసుకున్న‌ నిహారిక మ‌న‌కు ఆ పోస్టులో క‌నిపిస్తారు. నేను ఆ సీక్రెట్ చెప్పను.. ఒకవేళ చెప్తే అది సీక్రెట్ ఎలా అవుతుంద‌నే ప్ర‌శ్న‌, జ‌వాబు రెండూ త‌నే కొంటెగా చెప్ప‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఇంత‌కూ ఆ సీక్రెట్ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలో ఆ పోస్టులో ఓ హింట్ ఇచ్చారామె.

ఈ సీక్రెట్ ఏంటో  జోసెఫ్ రాధిక్  ఒక్కడికే తెలుసంటూ ఆ పోస్టులో నిహారిక చెప్పుకొచ్చారు. ఔను, ఇంత‌కూ జోసెఫ్ రాధిక్ ఎవ‌ర‌నే క‌దా మ‌నంద‌రి ప్ర‌శ్న‌. 

జోసెఫ్ రాధిక్ అంటే మ‌రెవ‌రో కాదండోయ్ ...ఇటీవ‌ల సోష‌ల్ మీడియాను షేక్ చేసిన నిహారిక‌, చైత‌న్య వివాహ చిత్రాల‌ను కెమెరాలో సృజ‌నాత్మ‌కంగా బంధించిన  ఫొటోగ్రాఫర్. ఇంత‌కూ ఫొటోగ్రాఫ‌ర్‌కు మాత్ర‌మే తెలిసిన ఆ ర‌హ‌స్యం ఏమై ఉంటుంద‌బ్బా అని నిహారిక అభిమానులు, నెటిజ‌న్లు తెగ ఆలోచిస్తున్నారు. 

ఎన్టీ రామారావు,జ‌గ‌న్ ల‌కు కొన్నిపోలిక‌లు

చంద్ర‌బాబు పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?