cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

మహేష్ వల్ల కానిది, కరోనా చేసి చూపించింది

మహేష్ వల్ల కానిది, కరోనా చేసి చూపించింది

మహేష్ నుంచి ఏడాదికి 2 సినిమాలు రావడం దాదాపు అసాధ్యం. కచ్చితంగా చేస్తానని చెబుతుంటాడు మహేష్. అభిమానులు ఎదురుచూస్తుంటారు. కానీ ఏడాదికి 2 సినిమాలు మాత్రం రావు. అయితే ఈసారి మాత్రం మహేష్ నుంచి ఒకే ఏడాది రెండు సినిమాలు వచ్చేలా ఉన్నాయి. కాకపోతే ఇది మహేష్ చేసిన ప్లానింగ్ కాదు. కరోనా వల్ల సాధ్యపడింది.

పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. ముందుగా ఈ మూవీని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా వల్ల షెడ్యూల్స్ ఆలస్యమై, వచ్చే ఏడాది సంక్రాంతికి షిఫ్ట్ అయింది. తాజాగా త్రివిక్రమ్ తో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు.

సో.. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2022లో మహేష్ నుంచి 2 సినిమాలొస్తాయి. పోనీ.. త్రివిక్రమ్ సినిమా ఇంకాస్త ఆలస్యమైందనుకున్నప్పటికీ.. సమ్మర్ మిస్సయినా, దసరాకు గ్యారెంటీ. 2022 మాత్రం దాటదు. ఇలా మహేష్ నుంచి వచ్చే ఏడాది 2 సినిమాలు పక్కాగా వచ్చేలా ఉన్నాయి.

అప్పుడెప్పుడో ఏడేళ్ల కిందట మహేష్ నుంచి ఒకే ఏడాది 2 సినిమాలొచ్చాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఫీట్ రిపీట్ కాబోతోందన్నమాట. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×