Advertisement

Advertisement


Home > Movies - Movie News

జాతీయ సినీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం!

జాతీయ సినీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం!

68వ జాతీయ అవార్డుల ప్ర‌దానోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము జాతీయ అవార్డు గ్ర‌హీత‌ల‌కు బ‌హుక‌రించారు. అప్ప‌టికే వెల్ల‌డైన విజేత‌ల వివ‌రాల ప్ర‌కారం... జాతీయ అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. ఈ అవార్డుల్లో సౌత్ సినిమాలు పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించాయి. 

జాతీయ ఉత్త‌మ న‌టుడిగా త‌మిళ‌న‌టుడు సూర్య అవార్డును పొందాడు. సూరారై పొట్రు సినిమాలో న‌ట‌న‌కు గానూ సూర్య జాతీయ అవార్డును పొందాడు. సూర్య‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్ కు కూడా ఈ అవార్డు ద‌క్కింది. త‌న్హాజీ సినిమాకు గానూ అజ‌య్ కు ఈ అవార్డు ల‌భించింది.

ఇక ఉత్త‌మ న‌టిగా న‌లిచింది సూరారై పొట్రు హీరోయిన్ అప‌ర్ణా బాల‌ముర‌ళి. జాతీయ ఉత్త‌మ ద‌ర్శ‌కుడి అవార్డు ఈ ఏడాదికి మ‌ల‌యాళీ ద‌ర్శ‌కుడు శ‌చికి ద‌క్కింది. అయ్య‌ప్ప‌నుమ్ కోషియుం సినిమాకు గానూ ఈ ద‌ర్శ‌కుడి అవార్డు ద‌క్కింది. శ‌చి 2020లోనే దివంగ‌తుల‌య్యారు.

ఉత్త‌మ చిత్రంగా సూరారై పొట్రు నిలిచింది. అలాగే మ‌ల‌యాళీ సినిమా అయ్య‌ప్పనుమ్ కోషియుం న‌టుడు బిజూ మీన‌న్ కు స‌పోర్టింగ్ ఆర్టిస్ట్ కేట‌గిరిలో జాతీయ అవార్డు ల‌భించింది. ఈ సినిమా యాక్ష‌న్ డైరెక్ష‌న్ విభాగంలో కూడా అవార్డును పొందింది.

ఇక ఉత్త‌మ ప్రాంతీయ కేట‌గిరిలో తెలుగు సినిమా క‌ల‌ర్ ఫోటోతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళీ, హిందీ, మ‌రాఠీ, అస్సామీ, బెంగాళీ భాష‌ల సినిమాల‌కు కూడా అవార్డులు ల‌భించాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?