cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ ఇద్దరితో సినిమా దిల్ రాజు కోరిక

ఆ ఇద్దరితో సినిమా దిల్ రాజు కోరిక

నిర్మాత రామానాయుడుకు ఓ కోరిక వుండేది. భారతీయ భాషలు అన్నింటిలో సినిమా తీయాలన్నది ఆయన కోరిక. ఈ జనరేషన్ లో రామానాయుడు రేంజ్ ప్రొడ్యూసర్ ఎవరూ అంటే దిల్ రాజే. 

ఆయనకు కూడా ఓ కోరిక వుంది. తెలుగులో వున్న ఆల్ మోస్ట్ ఆల్ హీరోలతో సినిమాలు చేయాలని. ఇప్పటివరకు ఆయన ఆల్ మోస్ట్ ఆల్ హీరోలతో సినిమా చేసారు. కానీ సీనియర్ హీరో బాలయ్య తో జూనియర్ హీరో అఖిల్ తో సినిమాలు చేయలేదు. అందుకే ఇప్పుడు ఆ ఇద్దరు హీరోల మీద దిల్ రాజు దృష్టి పెట్టారు. 

ఓ ఏడాది లోగా ఆ ఇద్దరితో రెండు సినిమాలు చేసేయాలని చూస్తున్నారు. కావాల్సిందల్లా డైరక్టర్లు దొరకాలి. బాలకృష్ణతో అనిల్ రావిపూడిని జతచేయాలని ఓ ఆలోచన. ఏమాత్రం అవకాశం వున్నా ఎఫ్ 3 కి కంటిన్యూయేషన్ గా చేసేయాలని అనుకుంటున్నారు. 

కానీ మహేష్ తో అనిల్ రావిపూడి సంగతి తేలాలి. అఖిల్ కు సురేందర్ రెడ్డితో సినిమా వుంది. దాని సంగతి క్లారిటీ వస్తే తన సినిమా ప్లాన్ చేయాలని కూడా అనుకుంటున్నారు దిల్ రాజు. 

దేశం మౌనం పాటిస్తోంది

ఆ పేరు కూడా పలకను

 


×