cloudfront

Advertisement


Home > Movies - Movie News

‘ఆగడు’ ఆడియో రిపోర్ట్‌

‘ఆగడు’ ఆడియో రిపోర్ట్‌

థమన్‌ 50వ చిత్రం ‘ఆగడు’ పాటలు మార్కెట్లోకి వచ్చేసాయి. విడుదలయ్యే వరకు ఇందులో ఒక్క పాట కూడా ఎలా ఉంటుందనేది బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆడియో ప్రోమోలు విడుదల చేసే సాంప్రదాయాన్ని కూడా వదిలి పెట్టేసారు. ఇంతకీ థమన్‌ తన హాఫ్‌ సెంచరీ మూవీకి ఎలాంటి మ్యూజిక్‌ చేసాడు?

మహేష్‌బాబు చిత్రాలకి బెస్ట్‌ మ్యూజిక్‌ అందించే థమన్‌ ఇంతకుముందే అతనికి ‘ఇటు రాయే.., పువ్వాయ్‌ పువ్వాయ్‌, నీ దూకుడు, సారొస్తారా, భాగ్‌ సాలే..’ లాంటి సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ కంపోజ్‌ చేసాడు. ‘ఆగడు’కి కూడా థమన్‌ తన బెస్ట్‌ వర్క్‌ అందించినట్టే అనిపిస్తోంది. ఫస్ట్‌ ఇంప్రెషన్‌ని బట్టి ‘ఆగడు’ ఆడియోలో కనీసం మూడు పాటలైనా పాపులర్‌ అయ్యేట్టున్నాయి. 

‘ఆజా సరోజా’, ‘ఆగడు టైటిల్‌ సాంగ్‌’, ‘భేల్‌ పూరి’ పాటలు ఇన్‌స్టంట్‌ విన్నర్స్‌. మిగతా రెండు కూడా వినడానికి బానే అనిపిస్తాయి. పాడుకునే పాటలు కాకపోయినా కానీ వింటున్నంతసేపు ఎంటర్‌టైన్‌ చేసే టిపికల్‌ థమన్‌ పాటలివి. సినిమా విజయానికి దోహదపడినా లేకున్నా... విజయంలో పాత్ర పోషించడానికి అనువైన బాణీల్నే అందించాడు.