cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఎబిసిడి... సబ్జెక్ట్ ఓకె... కానీ

ఎబిసిడి... సబ్జెక్ట్ ఓకె... కానీ

మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన హిట్ సినిమా ఏబిసిడి.. అమెరికన్ బార్న్డ్, కన్ఫ్యూజ్డ్ దేశీ అన్నది డిటైల్డ్ టైటిల్. ఈ సినిమాను తెలుగులో అల్లుశిరీష్ హీరోగా రీమేక్ చేసారు నిర్మాత మధుర శ్రీధర్ అండ్ కో. ఈ సినిమా మే నెలలో స్క్రీన్ మీదకు వస్తుంది. కానీ ముందుగానే ట్రయిలర్ వదిలారు. 

ట్రయిలర్ లో సినిమా జోనర్, కథ, లైన్ ఆఫ్ ఆర్డర్ కూడా చెప్పే ప్రయత్నం కనిపించింది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన కుర్రాడి అగచాట్లు, ఆపై ఇక్కడి సిస్టమ్ లో ఇమడడానికి చేసే ప్రయత్నాలు, ఆపైన హీరోయిజం మామూలే. మళయాలంలో ఈ సినిమా హిట్ అయిందంటే అక్కడ హీరో దుల్కర్ అందించిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఫన్.

హీరోయిజాన్ని పూర్తిగా పక్కనపెట్టి దుల్కర్ ఆ సినిమాలో కామెడీ చేసాడు. తన ఫేస్ లో కామెడీ ఎన్నివిదాల పలికించాలో అన్నివిధాలా పలికించే ప్రయత్నం చేసాడు. కానీ తెలుగు ట్రయిలర్ చూస్తుంటే, హీరో అల్లుశిరీష్ తన గత సినిమాల స్టయిల్స్ లోనే వెళ్లినట్లు కనిపిస్తోంది. కొత్తగా చేయడానికి ప్రయత్నం చేసినట్లు కనిపించడం లేదు. అందువల్ల మళ్లీ మరో అల్లుశిరీష్ సినిమా చూసినట్లు వుంది తప్పకాదు.