cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సెకండ్ వేవ్ వచ్చింది.. సమంత గుర్తొచ్చింది

సెకండ్ వేవ్ వచ్చింది.. సమంత గుర్తొచ్చింది

సమంత హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. ఆహా యాప్ కోసం యాంకర్ అవతారం ఎత్తిన ఈ అక్కినేని కోడలు.. కాంట్రాక్ట్ ప్రకారం మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తిచేసింది. చిరంజీవి, నాగచైతన్య, రానా, అల్లు అర్జున్, రకుల్ లాంటి తారల్ని ఇంటర్వ్యూలు చేసింది. ఇప్పుడు మరోసారి సమంతను తెరపైకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తోంది ఆహా. దీనికి కారణం కరోనా.

సెకెండ్ వేవ్ లో మరోసారి ఓటీటీకి గిరాకీ పెరిగింది. థియేటర్లు మూతపడ్డంతో అంతా ఓటీటీపై పడ్డారు. ఇలాంటి టైమ్ లో అమెజాన్ ప్రైమ్ తో పోటీపడి సినిమాలు దక్కించుకోవడం అల్లు అరవింద్ వల్ల కాదు. అందుకే సమంతను మరోసారి ఆహా వేదికపైకి తీసుకురావాలని భావిస్తున్నాడు ఈ నిర్మాత.

అంతా బాగానే ఉంది కానీ, సమంత రాకతో ఆహాకు మైలేజీ పెరుగుతుందా అనేది ఇక్కడ ప్రధాన సందేహం. ఎందుకంటే.. మొదటి రౌండ్ ఇంటర్వ్యూలే తేలిపోయాయి. కార్యక్రమం డిజైన్ బాగాలేదంటూ పెదవి విరుపులు పడ్డాయి. 

ఏకంగా చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి ఇంటర్వ్యూలు స్ట్రీమింగ్ చేసినప్పుడు కూడా వ్యూయింగ్ అవర్స్ (వీక్షకుడు చూసే టైమ్) పెరగలేదు. ఉన్నతంలో సమంత-నాగచైతన్య ఇంటర్వ్యూ మాత్రమే క్లిక్ అయింది.

ఇలాంటి టైమ్ లో సమంతతో మరోసారి ఇంటర్వ్యూల కార్యక్రమం పెట్టడం ఎంత వరకు కరెక్టో వాళ్లే నిర్ణయించుకోవాలి. ఒకవేళ పెట్టినా ఈసారి కాన్సెప్ట్ పూర్తిగా మార్చేయాలి. 

అదే పాత పద్ధతిలో సామాజిక సందేశాన్ని, వినోదాన్ని, మానవత్వం కోణాన్ని మిక్స్ చేయాలనుకుంటే మాత్రం కష్టమే. సీజన్-1లో ఇంటర్వ్యూలకు నందినీరెడ్డి క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×