cloudfront

Advertisement


Home > Movies - Movie News

హిట్ కొట్టాడు.. పెళ్లి చేసుకున్నాడు

హిట్ కొట్టాడు.. పెళ్లి చేసుకున్నాడు

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి, అదే ఊపులో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇతడు త్వరలోనే పెళ్లి చేసుకుంటాడంటూ నెల రోజులుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. దానికి ఊతమిస్తూ, మరో కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నానంటూ అజయ్ కూడా హింటిచ్చాడు. అలా, ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు అజయ్ భూపతి. 

ఈ పెళ్లికి కేవలం అజయ్ భూపతి, పెళ్లికూతురు సంబంధీకులు మాత్రమే హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రీ నుంచి అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. ఏమైందో ఏమో.. తన గురువు రామ్ గోపాల్ వర్మను కూడా ఈ పెళ్లికి ఆహ్వానించలేదు అజయ్ భూపతి. అంత గంభనంగా పెళ్లి తంతు కానిచ్చేశాడు. అంతెందుకు, చివరికి తన భార్య వివరాలు కూడా వెల్లడించలేదు.

ఒకదశలో ఆత్మహత్య చేసుకోవడం వరకు వెళ్లిన తను, ఆ తర్వాత జరిగిన సంఘటనల కారణంగా వ్యక్తిగత విషయాల్ని ఎవ్వరితో షేర్ చేసుకోవడం మానేశానని, ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ గా ప్రకటించాడు. చెప్పినట్టుగానే చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. 

ఆర్ఎక్స్ 100 టైపులోనే తన నెక్ట్స్ సినిమా కూడా బోల్డ్ గా ఉంటుందని ప్రకటించిన అజయ్.. ఆ మూవీలో హీరో ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కొన్ని రోజులు వైవాహిక జీవితాన్ని అనుభవించి ఆ తర్వాత కొత్త సినిమా సంగతులు బయటపెడతాడు.

అజయ్ భూపతి పెళ్లి ఫోటోల కోసం క్లిక్ చేయండి