Advertisement

Advertisement


Home > Movies - Movie News

బైక్ పై 4వేల కిలోమీటర్లు.. హీరో 'రియల్' ఫీట్

బైక్ పై 4వేల కిలోమీటర్లు.. హీరో 'రియల్' ఫీట్

హీరో అజిత్ కు బైక్స్ అంటే ఎంతిష్టమో చాలామందికి తెలుసు. ఖాళీ టైమ్ దొరికితే చాలు, బైక్ పై ఓ టూర్ వేస్తాడు ఈ స్టార్ హీరో. పలు బైక్ రేసుల్లో కూడా పాల్గొన్న అనుభవం ఉంది. ఇప్పుడీ హీరో మరో భారీ టూర్ లో ఉన్నాడు. ఈసారి ఏకంగా 4,500 కిలోమీటర్లు చుట్టేసే యాత్ర చేస్తున్నాడు.

ఈసారి అజిత్ ప్లాన్ చేసిన ట్రిప్ అంటో తెలుసా? ఏకంగా చెన్నై టు సిక్కిం. తన దగ్గరున్న బీఎండబ్ల్యూ బైక్ పై ఈ రోడ్ ట్రిప్ స్టార్ట్ చేశాడు అజిత్. ఆల్రెడీ వారణాసి వరకు వెళ్లిపోయాడు కూడా. అక్కడ ఓ అభిమానితో అజిత్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వారణాసి నుంచి సిక్కిం వెళ్తున్న అజిత్.. అక్కడ కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని.. తిరిగి చెన్నై చేరుకుంటాడు. ఇలా ఈ ట్రిప్ లో 4500 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డ్ సృష్టించబోతున్నాడు.

అజిత్ కు ఇలాంటి ట్రిప్స్ కొత్తకాదు. లాక్ డౌన్ కొత్తలో హైదరాబాద్ లో సినిమా షూటింగ్ లో ఉన్నాడు అజిత్. ఆ టైమ్ లో యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ కోసం ఓ బైక్ తెప్పించారు. అది అజిత్ కు బాగా నచ్చింది. దీంతో తన ఫ్లయిట్ టిక్కెట్ క్యాన్సిల్ చేయించి, ఆ బైక్ పై హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిపోయాడు ఈ హీరో. 

ఇప్పుడు ఏకంగా చెన్నై నుంచి సిక్కిం టూర్ షురూ చేశాడు. బైక్ రైడ్స్ తో పాటు అజిత్ కు రోబోటిక్స్, డ్రోన్స్ అంటే చాలా ఇష్టం. వాటిపై అతడు పెట్టుబడులు కూడా పెడుతుంటాడు.

చంద్ర‌బాబు పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?