Advertisement

Advertisement


Home > Movies - Movie News

అఖండ...రంగుమార్చిన పంది ఎవరో?

అఖండ...రంగుమార్చిన పంది ఎవరో?

బోయపాటి డైలాగులు, ప్రెజెంటేషన్ పవర్ ఫుల్ గా వుంటాయి. డైలాగుల్లో కాస్త ఇన్నర్ మీనింగ్ లు కూడా వుంటాయి. సినిమా చూస్తే, మొత్తం సీన్ అంతా తెలిస్తే కాస్త ఆనుపాను దొరుకుతుంది. 

దమ్ము సినిమా ఇలాంటి వైనానికి పక్కా ఉదాహరణ. సరే, ఈ సంగతి ఎందుకు ప్రస్తావన అంటే, బాలయ్యతో ముచ్చటగా మూడోసారి బోయపాటి తీస్తున్న సినిమా టీజర్, టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ముందుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినట్లే 'అఖండ' అన్నదే టైటల్ గా బయటకు వచ్చింది. 

టైటిల్ తో పాటు వదిలిని టీజర్ లో మాంచి పవర్ ఫుల్ డైలాగు వేసారు. రంగుమార్చిన పంది వచ్చి రంకెలు వేసే నంది ముందు నిల్చుంటే...అంటూ. బాలయ్య రంకెలు వేసే బసవన్న అన్నది ఓకె. ఇంతకీ ఆ రంగులు మార్చిన పంది ఎవరో? 

థమన్ అందించిన ఆర్ఆర్ సూపర్ గా వుంది. టీజర్ భారీగా కట్ చేసారు. బాలయ్య కాస్త భీకరంగా, బలంగా కనిపించారు. ఇప్పటికే ఈసినిమా మీద కాస్త అంచనాలు వున్నాయి. ఈ టీజర్ ఆ అంచనాలు పెంచేలాగే వున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?