Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఏజెంట్ అఖిల్ వచ్చేశాడు

ఏజెంట్ అఖిల్ వచ్చేశాడు

అఖిల్ పేరు చెప్పగానే క్యూట్ ఫేస్ గుర్తొస్తుంది. ఓ లవర్ బాయ్ గుర్తొస్తాడు. ఇన్నాళ్లు అదే ఇమేజ్ తో సినిమాలు చేసిన ఈ అక్కినేని హీరో ఇప్పుడు ఒక్కసారిగా గెటప్ మార్చేశాడు. గడ్డం, జుట్టు పెంచాడు. సిగరెట్ వెలిగించాడు. రఫ్ లుక్ లో సీరియస్ గా చూస్తున్నాడు.

అఖిల్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్ వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అఖిల్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ను ఇలా ఒకేసారి ప్రకటించారు.

అంతేకాదు.. మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా బయటపెట్టారు. ఏప్రిల్ 11 నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుందని, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని కూడా ప్రకటించేశారు.

స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ సాధించాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమౌతోంది. వక్కంతం వంశీ స్టోరీ అందించాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాను అఖిల్ మార్కెట్ కు మించి, భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?