Advertisement

Advertisement


Home > Movies - Movie News

దూత వచ్చింది.. చైతూపై ట్రోలింగ్ మొదలైంది

దూత వచ్చింది.. చైతూపై ట్రోలింగ్ మొదలైంది

అక్కినేని ఫ్యాన్స్, వాళ్ల హీరోల్లానే కూల్ గా ఉంటారు. కానీ కోపం వచ్చిందంటే ఫైరింగ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు అలాంటి ట్రోలింగ్ నే ఎదుర్కొంటున్నాడు హీరో అక్కినేని నాగచైతన్య. దూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు కదా, ఈ ట్రోలింగ్ ఏంటి అనుకుంటున్నారా..?

దూత సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలామందికి ఈ సిరీస్ నచ్చింది, అక్కినేని ఫ్యాన్స్ కు కూడా. సరిగ్గా ఇక్కడే అభిమానులకు చిన్నపాటి కోపం కూడా మొదలైంది.

గతంలో విక్రమ్ కుమార్, నాగచైతన్య కాంబినేషన్ లో థ్యాంక్ యు అనే సినిమా వచ్చింది. అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అదే టైమ్ లో వీళ్లిద్దరూ దూత గురించి చర్చించుకున్నారు. థ్యాంక్ యు అనే రొటీన్ సినిమా తీసే బదులు, దూత కథనే సినిమాగా తీసి ఉంటే ఈపాటికి పాకెట్ లో మంచి హిట్ ఉండేదని, నాగచైతన్య ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

బంగార్రాజు తర్వాత నాగచైతన్యకు హిట్ పడలేదు. భారీ అంచనాలతో వచ్చిన కస్టడీ సినిమా కూడా బోల్తా పడింది. ఇలాంటి టైమ్ లో దూత సిరీస్ నే సినిమాగా చేసి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడిక చేసేదేం లేదు.

దూత ప్రచారాన్ని పూర్తిచేసిన నాగచైతన్య, త్వరలోనే తండేల్ సెట్స్ లో జాయిన్ అవుతున్నాడు. అతడి ఫోకస్ మొత్తం ఆ సినిమాపైనే ఉంది. తన కెరీర్ కు తండేల్ సినిమాను గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నాడు నాగచైతన్య.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?