cloudfront

Advertisement


Home > Movies - Movie News

అందులో తప్పేముంది: లీకులు లైట్ అంటున్న బ్యూటీ

అందులో తప్పేముంది: లీకులు లైట్ అంటున్న బ్యూటీ

కొన్ని రోజులుగా అక్షర హాసన్ కు సంబంధించిన బికినీ ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్న విషయం తెలిసిందే. బెడ్ రూంలో బికినీ వేసుకొని అక్షర హాసన్ సెల్ఫీలు దిగినట్టుగా ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయి, వైరల్ అవుతున్నాయి. ఎట్టకేలకు వీటిపై అక్షర హాసన్ స్పందించింది. అయితే అందరికంటే కాస్త భిన్నంగా..

"ఆ ఫొటోలు లీక్ అవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ సినిమా ఫొటోషూట్ సందర్భంగా తీసుకున్న స్టిల్స్ అవి. నాకు నేనుగా కావాలని తీసుకున్న పిక్స్ కావు. అయినా ఆ స్టిల్స్ లో తప్పేముంది. మరోసారి కూడా అలాంటి ఫొటోలు తీసుకోవడానికి వెనకాడను నేను."

ఇలా ఫొటోలు లీక్ అయ్యాయని ఒప్పుకుంటూనే, అందులో తప్పేముందని ప్రశ్నిస్తోంది అక్షరహాసన్.  బికినీల్లో ఫొటోలు తీసుకోవడం వెరీ కామన్ అనే అర్థం వచ్చేలా రియాక్ట్ అయింది. అయినప్పటికీ ఈ లీక్స్ పై తను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించింది అక్షర. 

ఫొటో షూట్ టైమ్ లో తీసిన స్టిల్స్ లో కొన్నింటిని మాత్రమే వాడుకోవాలని, మిగతా అన్ని స్టిల్స్ ను డిలీట్ చేయాలని, అలా చేయకుండా ఇలా ఇంటర్నెట్ లో లీక్ చేయడం దారుణమంటోంది అక్షరహాసన్. ఒకవేళ తన స్టిల్స్ వాడుకోవాలనుకుంటే అది తన అనుమతితో జరగాలని అంటోంది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటోంది.

ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్